ఇస్నాపూర్ లో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

https://www.facebook.com/9staartv1/videos/2405632462899239/?t=6
ఈ నెల 20వ తేదీ నుండి నుండి ఇస్నాపూర్లో 46వ అంతర్ జిల్లా అండర్ 19 కబడ్డీ పోటీలు పాల్గొంటున్న అరవై ఆరు జట్లు,పూర్తయిన ఏర్పాట్లు,కబడ్డీ అసోసియేషన్ రాహ్ష్ట్ర అధ్యక్షుడు గడీల శ్రీకాంత్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారూ.
పఠాన్ చేరు మండలం ఇస్నాపూర్ లో మీడియా సమావేషంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రేపటి నుండి ఇస్నాపూర్ లో 46వ అండర్ 19 అంతర్ జిల్లా కబడ్డీ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గడీల శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఈ కబడ్డీ పోటీలలో తెలంగాణలోని 33 జిల్లాల నుంచి 33 అబ్బాయిల జట్లు,33 అమ్మాయిల జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ పోటీలలో విజయం సాధించిన వారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన హర్యానా కురుక్షేత్రలో జరిగే జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు. భారతీయుల సంప్రదాయ క్రీడ కబడ్డీని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ సమావేశంలో కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఊసిరెడ్డి, సలహాదారులు అమరేందర్ రెడ్డి రామిరెడ్డి ఉపాధ్యక్షులు హరీష్ రెడ్డి అసోసియేషన్ నాయకులు రమణారెడ్డి, రవీంద్ర రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాంత్ గౌడ్(కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు)
సంగారెడ్డి జిల్లా, పఠాన్ చేరు నియోజకవర్గం (VKC విలేకరి )

About The Author