మలేషియా మంత్రి ముహమ్మద్ బాక్టీఆర్ బిన్ వాన్ చిక్ హైదరాబాద్ లో…

మలేషియా పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి ముహమ్మద్ బాక్టీఆర్ బిన్ వాన్ చిక్ హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టొంబ్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం సాదరంగా స్వాగతించారు. కుతుబ్ షాహీ టొంబ్స్ యొక్క విశిష్టతను వివరించారు. కుతుబ్ షాహీ టొంబ్స్ అభివృద్ధి, పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల పై చర్చించారు బుర్రా వెంకటేశం. అనంతరం కుతుబ్ షాహీ టొంబ్స్ లోని మ్యూజియం ను మలేషియా పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి ముహమ్మద్ బాక్టీఆర్ బిన్ వాన్ చిక్ తిలకించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుతుబ్ షాహీ టొంబ్స్ అభివృద్ధి, పరిరక్షణకు తీసుకున్న జాగ్రత్తల పై ఆనందం వ్యక్తం చేశారు మలేషియా పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి ముహమ్మద్ బాక్టీఆర్ బిన్ వాన్ చిక్. ఈ పర్యటన లో మలేషియా జాతీయ హెరిటేజ్ శాఖ అధికారులు, మలేషియా దేశపు ప్రతినిధులు కుతుబ్ షాహీ టొంబ్స్ సందర్శనలో పాల్గొన్నారు. మలేషియా పర్యాటక శాఖ మంత్రి కి తెలంగాణ పర్యాటక, కళలు మరియు సాంస్కృతికి సంభందించిన పుస్తకాలను అందించారు బుర్రా వెంకటేశం.ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక కమిషనర్ సునీత భగవత్, హెరిటేజ్ తెలంగాణ డైరెక్టర్ డా. విశాలాక్షి, ఆగఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ CEO రతిష్ నంద పాల్గొన్నారు.

About The Author