జమ్మూలో వంద ఎకరాల్లో తిరుమల శ్రీవారి ఆలయం…


కలి యుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని దేవాలయం జమ్మూ-కశ్మీరులో నిర్మించబోతున్నారు. దీనిని తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికోసం దాదాపు 100 ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఓ జాతీయ దినపత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం ఈ భూమిని జమ్మూ-కాట్రా హైవేలో కేటాయించే అవకాశం ఉంది.

జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం సూత్రప్రాయంగా ఈ భూమిని కేటాయించేదుకు అంగీకరించినట్లు మీడియా పేర్కొంది. ఈ దేవాలయాన్ని రెండేళ్లలో పూర్తి చేసేందుకు ట్రస్ట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది.

తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా ఓ దేవాలయాన్ని నిర్మించడంతోపాటు, వేద పాఠశాల, ఆసుపత్రి కూడా ఈ ప్రాంగణంలో ఏర్పాటవుతాయని తెలుస్తోంది.

జమ్మూ జిల్లాలోని ధుమ్మి, మజిని ప్రాంతాల్లో భూములను గుర్తించినట్లు టీటీడీ బోర్డు ప్రతినిథి బృందానికి నాయకత్వం వహించిన విజయసాయి రెడ్డి చెప్పినట్లు మీడియా పేర్కొంది. ఈ రెండిటిలో ఏదో ఒక చోట భూమిని టీటీడీకి కేటాయిస్తారని తెలిపింది.

About The Author