చైల్డ్ ఫండ్ ఇండియా సహకారంతో ప్రజా సేవా …
బాలల సమస్యల పట్ల స్పందించి బాలల స్నేహపూర్వక గ్రామాల రూపకల్పనకు తోడ్పడాలని ప్రజాసేవ సమాజ్ చైల్డ్ ఫండ్ ఇండియా, ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు
చైల్డ్ ఫండ్ ఇండియా సహకారంతో ప్రజా సేవా సమాజ్ సంస్థ కదిరి రూరల్ మండలం కెఎన్ పాలెం గ్రామంలో గ్రామ స్థాయి బాలల రక్షణ కమిటీ సభ్యులు మరియు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రజా సేవా సమాజ్ *కోఆర్డినేటర్ శ్రీనివాసులు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కమిటీ సమావేశం జరిగింది*. ఈ సందర్భంగా *ప్రాజెక్టు మేనేజర్ శ్రీనాథ్ రెడ్డి* గారు మాట్లాడుతూ బాలల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు కె ఎన్ పాలెం, ఎర్రదొడ్డి, కుమ్మరవాండ్ల పల్లి మరియు ఎగువపల్లి పంచాయతీలలో ప్రభుత్వ అధికారులు గ్రామ ప్రజలు పిల్లలతో కలిపి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.
అందులో భాగంగా కమిటీని ఏర్పాటు చేసి గత ఐదు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు తల్లిదండ్రులు మరియు బాలల రక్షణ కమిటీ సభ్యులతో కలిసి సమన్వయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది అన్నారు పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డి గారు ఈ వి సి పి సి గురించి ప్రజలకు వివరించి బాలల సమస్యలపై చర్చ జరిపారు. తర్వాత కమిటీ ఏర్పాటు గురించి వివరించారు. ఈ సందర్బంగా తల్లి తండ్రులు మరియు పిల్లలు బాలల మరియు గ్రామ సమస్యలు తీర్చాలని కమిటీ సభ్యులకు విజ్ఞాపనా పత్రం ఇచ్చారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళతామని.
గ్రామ సచివాలయ సిబ్బంది తెలిపారు.
చైల్డ్ లైన్ 1098 జిల్లా కోఆర్డినేటర్ కృష్ణమాచారి మాట్లాడుతూ ఈ కమిటీ ఇన్ని సంవత్సరాలుగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అనేక సమస్యలను కమిటీ పరిష్కరించడం చాలా హర్షణీయమని తెలిపారు *ఈ కమిటీ గ్రామస్థాయిలో బాల్య వివాహ నిరోధక కమిటీ కూడా గా కూడా* విధులు నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సలీం పంచాయతీ కార్యదర్శి లోహిత అసిస్టెంట్ ఇంజనీర్ తిప్పారెడ్డి అంగన్వాడీ కార్యకర్త మల్లమ్మ ఆశా వర్కర్ పద్మావతమ్మ మరియు తల్లిదండ్రులు, చైల్డ్ లైన్ సిబ్బంది , pss సిబ్బంది పాల్గొన్నారు.