ఆంధ్రప్రదేశ్‌ మెడ్‌టెక్‌ జోన్‌ను జాతికి అంకితం…

విశాఖలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ మెడ్‌టెక్‌ జోన్‌ను జాతికి అంకితం చేయడం గర్వంగా ఉంది. 270 ఎకరాల్లో 18 అత్యాధునిక పరిశోధనాశాలలు, 250 వైద్య పరికరాల తయారీ సంస్థలు ఈ జోన్‌లో రూపుదాల్చనున్నాయి. ఇక్కడి వైద్య పరికరాలను విదేశాలకు సైతం ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటాం.

విశాఖ పారిశ్రామిక చరితలో మరో మైలురాయిలాంటి మెడ్‌టెక్‌ జోన్‌ లో ఎనభై కంపెనీలు…ఉత్పత్తులను పరీక్షించే ల్యాబ్స్‌…రహదారులు…మంచినీటి సౌకర్యం…సోలార్‌ విద్యుత్‌తో కూడిన ఫేజ్‌-1 మెగా ప్రాజెక్టును కేవలం 342 రోజుల రికార్డు సమయంలో పూర్తిచేశారు. తొలి విడతలో 18 రకాల ల్యాబ్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సదస్సులు, సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా కలాం కన్వెన్షన్‌ సెంటర్‌ను 70 రోజుల్లోనే నిర్మించారు. తొలి ఫేజ్‌ అందుబాటులోకి రావడంతో రెండో ఫేజ్‌లో మరిన్ని సంస్థలు ముందుకువచ్చే అవకాశం ఉంది.

About The Author