వూహాన్ లో చిక్కుకున్న జ్యోతికి విముక్తి ..ప్రత్యేక విమానంలో బయలుదేరిన టెకీ..


వూహాన్ లో చిక్కుకున్న జ్యోతికి విముక్తి ..ప్రత్యేక విమానంలో బయలుదేరిన టెకీ.. చైనాలోని వూహాన్ సిటీలో చిక్కుబడిన కర్నూలు యువతి అన్నెం జ్యోతి కథ సుఖాంతమయింది. ఆమె క్షేమంగా భారత్ చేరుకోనుంది.. తాను బుధవారం విమానంలో భారత్‌కు వస్తునట్లు జ్యోతి తమ కుటుంబ సభ్యులతో చెప్పడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి ఇడియాకు వస్తునట్లు ఫోన్ వచ్చిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.. కాగా, ఇటీవలే సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన జ్యోతి ట్రైనింగ్ కోసం చైనాలోని వూహాన్ నగరానికి వెళ్లింది. అదే సమయంలో కరోనా వైరస్ విజృంభించడంతో ఆమె అక్కడే చిక్కుకుపోయింది. ఈ దశలో చైనాలోని చిక్కుకున్న భారతీయులను స్వదేశం చేర్చేందుకు మొదట రెండు ఎయిరిండియా విమానాలు అక్కడకు వెళ్లాయి. అయితే జ్యోతిని తీసుకొచ్చేందుకు అధికారులు నిరాకరించారు. ఆమెకు కరోనా వైరస్ సోకిన లక్షణాలు ఉన్నాయని అందుకే ఆమెను తీసుకురావడం లేదని విమాన సిబ్బంది తెలిపారు. దీంతో కుంటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అయితే తనకు స్వల్ప జ్వరం మాత్రమే వచ్చిందని.. కరోనా సోకలేదని, తనను వెంటనే భారత్‌కు చేర్చాలని ఆమె సెల్ఫీ వీడియోలో భారత ప్రభుత్వాన్ని కోరింది. అటు ఆమె తల్లిదండ్రులు, కాబోయే భర్త అమరనాథ్ రెడ్డి కూడా భారత అధికారులను అభ్యర్థించారు. ఇది ఇలా ఉంటే భారత్ నిన్న తన సి 17 గ్లోబ్ మాస్టర్ కార్గో విమానాన్ని మందులతో చైనాకు పంపింది.. ఆ విమానంలో జ్యోతిని ఇక్కడకు తీసుకురానున్నారు. అలాగే అక్కడ చిక్కుకున్న ఇతర భారతీయులు సైతం ఈ విమానం ద్వారా ఢిల్లీకి రానున్నారు.. కాగా, జ్యోతి, అమరనాథ్ ల వివాహం మార్చి 14న జరగనుంది.. స్వగ్రామానికి జ్యోతి తిరిగి వస్తుండటంతో తల్లి, కాబోయే భర్త ఆనందం వ్యక్తం చేశారు.. భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

About The Author