ఈ నెల 19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ…

ఈ నెల 19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ…


బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన చీరలను ఈ నెల 19 నుంచి పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్భంగానే పంచడానికి ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు వల్ల ఆగిపోయిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్లకు అందజేసే దుస్తులతో పాటు బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో ఈ నెల 19 నుండి బతుకమ్మ చీరల పంపిణికి తగు ఏర్పాట్లను చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
సోమవారం సచివాలయంలో బతుకమ్మ చీరల పంపిణి,ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముభారక్, జూనియర్ గ్రామకార్యదర్శుల నియామకం, పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు , జాతీయ రహదారుల భూసేకరణ, క్రిస్ మస్ గిఫ్ట్ ప్యాకుల పంపిణి, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ బతుకమ్మ చీరల పంపిణికి సంబంధించి ప్రజా ప్రతినిధులందరు ఈ కార్యక్రమంలో పాల్గొనెలా చూడాలని , రోజు వారి పంపిణికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ బతుకమ్మ చీరలను ఇప్పటికే జిల్లాలకు పంపామని 5,6 రోజుల్లోగా పంపిణి పూర్తీ య్యేలా కార్యక్రమం రూపొందించుకోవాలన్నారు. జిల్లా గోడౌన్స్ నుండి గ్రామస్థాయి గోడౌన్స్ కు చేరేలా రవాణా ప్రణాళికను తయారు చేసుకోవాలన్నారు. గ్రామ గోడౌన్లకు పర్సనల్ ఇంచార్జీలను నియమించాలన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీలలో పంపిణీ కి సంబంధించి మహిళా సంఘాలు, అధికారులు, వార్డు కమీటీలను నియమించి సమీక్షించాలన్నారు. జిల్లాల వారీగా లబ్దిదారుల లిస్టులు ఇపిడియస్ పోర్టల్ లో ఉన్నాయని, గ్రామాల వారీగా తయారు చేసుకోవాలన్నారు. గ్రామాలలో పంపిణీ తేదీలను పత్రికల ద్వారా ప్రజలకు తెలిసేలా ప్రచారం నిర్వహించాలన్నారు. పంపిణీలో తప్పని సరిగా ప్రజా ప్రతినిధుల భాగస్వౌమ్యం ఉండాలన్నారు.
జౌళి, చేనేత శాఖ కమీషనర్ శ్రీమతి శైలజా రామయ్యర్ మాట్లాడుతూ దాదాపు 90 లక్షల చీరలు పంపిణీ చేస్తున్నామని , పంపిణీ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్లును కోరారు.
కల్యాణ లక్ష్మి , షాదీముభారక్ లకు సంబంధించి సి.యస్ సమీక్షించారు. యస్ .సి. అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో 60 రోజులకు మించి దాదాపు 1000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వీటిని వెంటనే పరిష్కరించాలన్నారు. బి.సి. సంక్షేమ శాఖ కార్యదర్శి బి.వెంకటేశం మాట్లాడుతూ , కల్యాణ లక్ష్మి , షాదీముభారక్ మంజూరు అధికారాన్ని శాసన సభ సభ్యులకు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. జిల్లాల వారిగా అవసరమైన నిధుల వివరాలు తెలపాలన్నారు.
మైనారీటీ సంక్షేమ శాఖ కార్యదర్శి బెనహర్ మహేష్ దత్ ఎక్కా మాట్లాడుతూ క్రిస్ మస్ పండుగ సందర్బంగా క్రిస్టియన్ సోదరులకు ఈ నెల 18న గిఫ్ట్ ప్యాక్ లను , 20న ఫుడ్ మెటీరియల్ పంపిణీకి తగు ఏర్పాట్లు చేయాలన్నారు.
ఆసరాఫించన్ల పంపిణి సంబంధించి సి.యస్ మాట్లాడుతూ 57 సంవత్సరాలు వయస్సు నిండిన వారికి ఆసరాఫించన్లు మంజూరు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం లో భాగంగా అర్హుల ఎంపిక కోసం ఓటరు లిస్టులను వినియోగించు కోవాలని , రెండు లేదా మూడు రోజుల లోగా జిల్లాల వారిగా లబ్దిదారుల సంఖ్యను తెలపాలన్నారు.
పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో 57 నుండి 64 వరకు వయస్సు ఉన్న వారి వివరాలు తీసుకొని ఎస్.కె.ఎఫ్ డాటాలో సరిచేసుకొని 3,4 రోజులలోగా డ్రాఫ్ట్ లిస్టును గ్రామ సభలలో పబ్లిష్ చేయాలన్నారు. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ప్రోఫార్మను కమ్యూనికేట్ చేస్తామన్నారు. ఫించన్ల మంజూరు జిల్లా కలెక్టర్లు చేస్తారని, అనర్హులను తోలగించటానికి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలలో వార్షికాధాయం ఒక లక్ష యాబైవేలు , పట్టణాలలో రెండు లక్షల అదాయ పరిమితి ఉండాలన్నారు.
3 ఎకరాల తరి , 7.5 ఎకరాల మెట్ట భూములు ఉన్నవారు అర్హులన్నారు. అనర్హుల క్యాటగిరి వివరాలను పంపిస్తామన్నారు. ప్రతి కుటుంబంలో ఒకరికే అర్హత ఉంటుందన్నారు. అర్హత ఉన్న ప్రతి పేదవానికి పెన్షన్ అందేలా చూడాలన్నారు. అర్హులు, అనర్హుల జాబీతాను గ్రామ సభలో పెట్టాలన్నారు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం జాబితాను జిల్లా కలెక్టరు ఆమోదించి ప్రభుత్వానికి సమర్పించాలన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆమోదం పోందిన అనంతరం వచ్చే ఆర్ధిక సంవత్సరం నుండి కొత్త పెన్షన్లు అందించనున్నామన్నారు. 9355 జూనియర్ పంచాయతీ గ్రామ కార్యదర్శుల నియామకానికి సంబంధించి జిల్లాల వారిగా ఎంపిక చేసిన అభ్యర్ధుల హల్ టికెట్ల నెంబర్లను స్థానిక పత్రికల్లో ప్రచురించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సి.యస్ కోరారు.ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ మాట్లాడుతూ ఈ నెల 25 లోగా నియమకపు పత్రాలు జారీ చేసేలా కలెక్టర్లు పని చేయాలన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన అర్హుల సర్టిఫికెట్లను 3 రోజుల లోగా పరిశీలన పూర్తి చేసుకోవటానికి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రతి రోజు 3 నుండి 400 మంది అభ్యర్ధుల సర్టిఫికెట్లను పరిశీలించాలన్నారు. దరఖాస్తులో సమర్పించిన విద్యార్హత, వయస్సు, కులం, లోకల్ , ప్రత్యేక క్యాటగిరీల సర్టిఫికెట్లను పరిశీలించాలన్నారు. వీటికి సంబంధించి గైడ్ లైన్స్, చెక్ లిస్ట్ లను పంపుతున్నామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 27 న నిర్వహించే కాన్ క్లేవ్ లో గ్రామ కార్యదర్శులు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు పాల్గొనటానికి దృష్టి సారించాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి , స్టేట్ ఎలక్షన్ కమీషన్ అనుమతి పొందిన అనంతరం నోటిఫికేషన్ జనవరి మొదటి వారంలో జారీ చేయనున్నమని ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ తెలిపారు.పంచాయతీరాజ్ కమీషనర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ వార్డుల వారిగా బి.సి ఓటర్ల గుర్తింపుకు సంబంధించి టైమ్ లైన్ ప్రకారం నిర్వహిస్తున్నామని, 31 నాటికి మొత్తం ప్రాసెస్ ను పూర్తి చేయాలని కలెక్టర్లను కోరారు. బి.సి. రిజర్వేషన్ల గైడ్ లైన్స్ ను జారీ చేస్తున్నామని అన్నారు. రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి యం.పి.డి.ఓ లు , ఆర్.డి.ఓలు కు శిక్షణకు 2 లేదా 3 రోజులలోగా పూర్తి కావాలన్నారు. జిల్లాల వారీగా క్యాటగిరీ వైజ్ సీట్ల సంఖ్యను రూపోందించాలన్నారు.
జాతీయ రహదారుల భూసేకరణపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సి.యస్ అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు ఈ అంశాన్ని ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారని తెలిపారు. NHAI కి సంబంధించి 16 జిల్లాలలో, NH కు సంబంధించి 17 జిల్లాల లో పెండింగులో ఉన్నాయని ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ అన్నారు. జిల్లా కలెక్టర్లు ఈ అంశంపై ప్రత్యేకంగా సమీక్షించాలని ఈ పనులు సకాలంలో పూర్తీ చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి అత్యదిక నిధులు పొందాలన్నారు.

About The Author