శివమెత్తిన సత్యం (1979)… Song
తా.. ఓ గీతా
చిత్రం : శివమెత్తిన సత్యం (1979)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఏసుదాస్, వాణీ జయరాం
పల్లవి :
గీతా.. ఓ గీతా… డార్లింగ్…. మై డార్లింగ్…..
మనసారా నీతో..ఓ..ఓ..ఓ… మాటాడుకోనీ
మనసారా నీతో..ఓ..ఓ..ఓ… మాటాడుకోనీ
రాజా… ఓ రాజా.. డార్లింగ్…. ఓ మై డార్లింగ్..
మనసారా నీతో.. మాటాడుకోనీ
మనసారా నీతో.. మాటాడుకోనీ
చరణం 1 :
పరదేశంలో ఆవేశంతో… ప్రేమించిన మనకనుమతి.. బహుమతీ…
ఈ దేశంలో సంతోషంతో… మనువాడినతో… అనుబందం… ఆనందం…
వెచ్చనీ… వలపుల ముచ్చటా తీరునూ
అనురాగబంధం ముడివేసుకోనీ..
అనురాగబంధం ముడివేసుకోనీ
రాజా…ఓ..రాజా… డార్లింగ్..ఓ మై డార్లింగ్…
మనసారా నీతో.. మాటాడుకోనీ
మనసారా నీతో.. మాటాడుకోనీ
చరణం 2 :
చిరునవ్వులతో పులకింతలతో.. వికసించిన ఒక మధువనం.. యవ్వనం
ఈ భంగిమలో.. నీ పొంగులతో మురిపించే బిగి కౌగిలీ.. జిలిబిలి
ఊహలే రేగితే.. మోహమే ఆగునా… ఆ..ఆ..ఆ
ఒడిలోన నన్నూ.. వొదిగొదిగిపోనీ…
ఒడిలోన నన్నూ.. వొదిగొదిగిపోనీ
గీతా…. ఓ…. గీతా…
డార్లింగ్…. మై డార్లింగ్…
ఒడిలోన నన్నూ వొదిగొదిగిపోనీ…
ఒడిలోన నన్నూ వొదిగొదిగిపోనీ