LIC పాలసీ అదిరింది.. రూ.100తో రూ.70,000!


ఎల్‌ఐసీ తక్కువ ప్రీమియం మొత్తంతోనే ఒక పాలసీని అందుబాటులో ఉంచింది. ఈ పాలసీతో రూ.70,000 వరకు బీమా మొత్తం పొందొచ్చు. అసంఘటిత రంగ కార్మికుల ఆర్థిక భద్రత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వమే ఈ పని స్కీమ్ అందిస్తోంది.

కొత్తగా పాలసీ తీసుకోవాలని భావిస్తున్నారా? అది కూడా ఎల్‌ఐసీ నుంచి ఏదైనా ప్లాన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాలి. దేశీ దిగ్గజ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సోషల్ సెక్యూరిటీ పాలసీని అందిస్తోంది. దీని పేరు ఆమ్ ఆద్మీ బీమా యోజన. అసంఘటిత రంగంలోని కార్మికులు ఈ పాలసీ తీసుకోవచ్చు.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ పాలసీని అమలు చేస్తోంది. ఎల్‌ఐసీ ఈ పాలసీని కస్టమర్లకు అందిస్తోంది. ఈ పాలసీ తీసుకోవాలని భావిస్తే 18 నుంచి 59 ఏళ్ల మధ్యలో వయసు కలిగి ఉండాలి. కుటుంబంలోని పెద్దకు లేదంటే కుటుంబంలో సంపాదించే వ్యక్తి పేరుపై పాలసీ తీసుకోవలసి ఉంటుంది. రేషన్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, స్కూల్ సర్టిఫికెట్, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ప్రభుత్వం అందించే ఇతర గుర్తింపు కార్డులు వంటి డాక్యుమెంట్లు ఉంటే సరిపోతుంది.

ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకంలో చేరాలంటే తొలిగా రూ.200 కట్టాలి. 30,000ల కవరేజ్‌కు ఇది వర్తిస్తుంది. మీరు చెల్లించిన రూ.200 మొత్తంలో 50 శాతం కేంద్ర ప్రభుత్వపు సామాజిక భద్రత ఫండ్‌ నుంచి సబ్సిడీ లభిస్తుంది. అంటే మీరు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.

అదే మీరు గ్రామీణ ప్రాంతంలో నివసించే భూమిలేని కుటుంబం కిందకు వస్తే.. అప్పుడు మీరు చెల్లించే 50 శాతం మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అదే మీరు వృత్తి సమూహాలకు చెందిన వారైతే నోడల్ ఏజెన్సీ్/రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం మొత్తాన్ని చెల్లిస్తుంది. లేదంటే కొన్ని సందర్భాల్లో మీరే చెల్లించాల్సి రావొచ్చు.

ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకంలో చేరిన వ్యక్తి సహజంగా మరణిస్తే రూ.30,000 ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఈ డబ్బును కుటుంబ సభ్యులకు అందజేస్తారు. ఒకవేళ ప్రమాదవశాత్తు స్కీమ్‌లో చేరిన వ్యక్తి మరణిస్తే.. అప్పుడు రూ.75,000 చెల్లిస్తారు. ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం సంభవించినా కూడా ఇదే మొత్తాన్ని అందజేస్తారు.

ఎల్ఐసీ అందిస్తున్న ఈ స్కీమ్‌లో చేరడం వల్ల కేవలం ఇన్సూరెన్స్ డబ్బులు మాత్రమే కాకుండా పిల్లలకు స్కాలర్‌షిప్ కూడా ఇస్తారు. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు పిల్లలకు ఉపకార వేతనం అందజేస్తారు. 9 నుంచి 12వ తరగతిలోపు ఉన్న విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. ప్రతి ఏడాది ప్రతి విద్యార్థికి జూలై 1న రూ.600, జనవరి 1న రూ.600 చొప్పున అందిస్తారు.

About The Author