సహజనటి జయసుధ గారికీ జన్మదిన శుభాకాంక్షల…

సుజాత ఈ పేరు చెప్పగానే సీనియర్ నటి గుర్తుకొస్తారు, అయితే సహజనటి అనగానే జయసుధ తప్ప మరే నటీమణి గుర్తుకు రారు. జయసుధ గా మారిన సుజాత పుట్టటం మద్రాసీ గా నైనా అచ్చ తెలుగు ఆడపిల్ల. మేనత్త విజయనిర్మల నటించిన పండంటి కాపురం ఆవిడ మొట్టమొదటి సినిమా. 300 కు పైగా అన్ని భాషల్లో ను ఆవిడ నటించారు. జయసుధ హీరోయిన్ గా లెక్కలేనన్ని విజయాలు సొంతం చేసుకున్నారు. చంద్రమోహన్ జయసుధ ఒకప్పుడు హిట్ పెయిర్, మంచి జోడి కూడాను. కాస్త వయసు పెరిగి ఒదిన, అత్త, తల్లీ కారెక్టర్స్ చేస్తున్నప్పుడు ప్రకాష్ రాజ్, జయసుధ హిట్ పెయిర్ గా మారారు. ఏ పాత్ర చేయాల్సి వస్తే ఆ పాత్రలో ఇమిడిపోయే అద్భుత టాలెంట్ ఆవిడ సొంతమనక తప్పదు. మాతృ భాష తెలుగు, పుట్టి పెరిగింది తమిళనాడు, కోడలి గా స్థిరపడింది హిందీ నాట. మంచి నటిగా, రాజకీయ నాయకురాలిగా గొప్ప పేరు తెచ్చుకున్న సహజ నటి జయసుధ గారికి హృదయ పూర్వక జన్మ దిన శుభాకాంక్షలు అందిస్తోంది 9Staar Tv

About The Author