కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడానికి కారణమైన మంత్రులు, ఎమ్మెల్యేలు, క్రిమినల్ కేసు బుక్ చేయాలి…


కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరగడానికి కారణమైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసు బుక్ చేయాలి.రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా అత్యధిక కేసులు కర్నూలులో నమోదు కావడం చాలా బాధాకరం.ప్రజా ప్రతినిధులు విచ్చలవిడిగా జనాల మధ్య తిరుగుతూ కరోనా వైరస్ కారణమయ్యారు.జరుగుతున్న ఈ దారుణంపై దర్యాప్తు చేయించి అందుకు కారణమైన వారిపై క్రిమినల్ కేసులు బుక్ చేయాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా నివారణ చర్యలు కన్నా ఎన్నికల మీదే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు.నాటి ఎన్నికల కమిషనర్ ఎంతో ముందు జాగ్రత్తగా ఎన్నికల వాయిదా వేయడంతో పాటు కరోనా వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు.అయినా లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా సీఎం వ్యవహరించారు.వైస్సార్సీపీ నాయకుల మాదిరిగా వ్యక్తిగత విమర్శలు చేసే హీనస్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారలేదు.ప్రశ్నించడం,విమర్శించడం ఈ రెండింటికీ చాలా తేడా ఉంది.ఈ తేడా తెలియని వైయస్సార్ సిపి నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో కరోనా మహమ్మారి ప్రభుత్వ వైఫల్యం కారణంగానే వ్యాపిస్తుంది. ఇక్కడ ప్రజలు చాలా భయంతో బ్రతుకుతున్నారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే చాలా బాధగా ఉంది. కర్నూలులో ఒక్కసారిగా అత్యధిక కేసులు ఎందుకు నమోదయ్యాయి.ముఖ్యమంత్రి వల్లే రాష్ట్రం అధోగతి పాలు అయిపోయింది.ఊరందరిదీ ఒక దారైతే తమ దారి వేరు అనే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. రైతులకు చేసింది ఏమీ లేదు.పేద ప్రజలకు ఆదుకునే పరిస్థితులు కనిపించడం లేదు.తీరు మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు.

About The Author