సిరా అంటుకుని చేతి వేళ్లకు బొబ్బలు…

సిరా అంటుకుని చేతి వేళ్లకు బొబ్బలు…

పోలింగ్‌ కేంద్రంలో ఓటరు వేలికి సిరా గుర్తు పెట్టిన సమయంలో సిరా అంటుకుని చేతి వేళ్లకు బొబ్బలు వచ్చాయని ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు వాపోతున్నారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలానికి చెందిన కొందరు ఉద్యోగుల చేతులు, మోచేతికి, వేళ్లకు సిరా తగిలి బొబ్బలొచ్చి చర్మం ఊడింది. వీరిలో మహిళా ఉద్యోగులు సైతం ఉన్నారు. ఇలాంటి బాధితులు పలు చోట్ల పదుల సంఖ్యలో ఉన్నారని ఉద్యోగులు చెబుతున్నారు. గతంలో బొబ్బలు వచ్చిన దాఖలాలు లేవంటున్నారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా సిబ్బందికి చేతి గ్లౌజులు అందుబాటులో ఉంచాలంటున్నారు. నెల్లికుదురు మండలం బంజరలోని 183 పోలింగ్‌ బూత్‌లో విధులు నిర్వహించిన ఉద్యోగి ప్రభుదాస్‌ మాట్లాడుతూ..‘ఓటర్ల చేతి వేలికి సిరా పెట్టే క్రమంలో నా చేతి వేళ్లకు తగిలాయి. ఆ మరుసటి రోజు బొబ్బలు వచ్చాయి. ఎన్నికల్లో విధులు నిర్వహించిన నా సోదరి చేతి వేళ్లకు ఇలాగే గాయమైంది’ అని చెప్పారు.
అపాయం ఏమీ ఉండదు
‘మనం తలకు పెట్టుకొనే హెయిర్‌ డై(రంగు)లో పారా ఫిలిమన్‌ డయేమైన్‌(పీపీడీ) ఉంటుంది. ఇది రెండు శాతానికి తక్కువ ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. ఎక్కువ మోతాదులో ఉంటే శరీరంలో ఎలర్జీ ఉన్న వాళ్లలో కొందరికి పడదు. ఓటరు వేలికి పెట్టే సిరాలో ఉండే రసాయన పదార్థం వల్లే కొందరికి బొబ్బలొచ్చి చర్మం ఊడిపోతుంది. ఈ బొబ్బలకు భయపడాల్సిన అవసరం లేదు’ అం వైద్యులు చెప్పారు..

About The Author