మార్చి 31 నాటికి మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటిలో నీళ్ళు…

వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటిలో నల్లా బిగించి, పరిశుభ్రమైన మంచినీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో ఏ ఒక్క మనిషి కూడా మంచినీళ్ల కోసం బిందె పట్టుకుని బయట కనిపించవద్దని చెప్పారు. కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలనే తేడా లేకుండా రాష్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ పథకం ద్వారానే మంచినీళ్లు అందివ్వాలని, ఖర్చుకు వెనుకాడవద్దని సీఎం స్పష్టం చేశారు.

ప్రగతి భవన్ లో సోమవారం మిషన్ భగీరథపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు శ్రీ అనురాగ్ శర్మ, సిఎంఓ కార్యదర్శి శ్రీమతి స్మితా సభర్వాల్, మిషన్ భగీరథ ఇ.ఎన్.సి. శ్రీ కృపాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ జోగు రామన్న, శ్రీమతి గొంగిడి సునిత, శ్రీ రాజేందర్ రెడ్డి, శ్రీ కె. విద్యాసాగర్ రావు, శ్రీ భాస్కర్ రావు, వివిధ జిల్లాల నుంచి సిఇలు, ఎస్ఇలు, ఇఇలు హాజరయ్యారు.

సెగ్మెంట్ల వారీగా పనుల పురోగతిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అధికారులు పురోగతిని వివరించారు. 23,968 ఆవాస ప్రాంతాలకు గాను, 23,947 ఆవాస ప్రాంతాలకు ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా నీరు అందుతున్నదని చెప్పారు. మరో 21 గ్రామాలకు మాత్రమే అందాల్సి ఉందన్నారు. ఆ గ్రామాలు కూడా కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాల్లో ఉన్నవేనని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని 95 శాతం ఇండ్లకు నల్లాలు బిగించి మంచినీరు అందిస్తున్నట్లు నివేదించారు. ఓహెచ్ఎస్ఆర్ ల నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతున్నదన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, దళిత వాడలు, ఆదివాసీ గూడేలు, శివారు ప్రాంతాలు, మారుమూల పల్లెలు అన్నింటికీ మిషన్ భగీరథ ద్వారానే శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. అచ్చంపేట, సిర్పూరు నియోజకవర్గాలు, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కొత్తగూడెం లాంటి జిల్లాల్లోని మారుమూలలో ఉన్న చిన్న పల్లెలకు, ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న ఆవాస ప్రాంతాలకు కూడా కష్టమైనా సరే, ఆర్థికంగా భారమైనా సరే మిషన్ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేయాలని చెప్పారు. జనవరి 10లోగా అన్ని ఆవాస ప్రాంతాలకు మంచినీళ్లు చేరుకోవాలని గడువు విధించారు. మార్చి 31లోగా అన్ని ప్రాంతాల్లో అన్ని పనులు పూర్తి చేయాలని, ఆ తర్వాత రాష్ట్రంలో నల్లా ద్వారా మంచినీళ్ల సరఫరా కాని ఇల్లు ఒక్కటి కూడా మిగలవద్దని సీఎం నిర్దేశించారు.

‘‘ప్రతీ ఊరికి నీళ్లు పంపి, ప్రతీ ఇంటికి నల్లా ద్వారా మంచినీళ్లు ఇవ్వడంతోనే బాధ్యత తీరిపోదు. ఆ తర్వాత కూడా ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా మంచినీటి సరఫరా జరగాలి. ఇప్పటి వరకు జనం ఎక్కడికక్కడున్న వనరులతో అవసరాలు వెళ్లదీసుకున్నారు. ఏదో ఓ నీళ్లు తాగారు. ఒకసారి మిషన్ భగీరథ ద్వారా శుద్ది చేసిన మంచినీరు తాగిన తర్వాత ప్రజలు మరో రకం నీళ్లు తాగలేరు. ఏ ఒక్క రోజు మంచినీరు అందకున్నా తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. కాబట్టి మిషన్ భగీరథ ప్రాజెక్టును పూర్తి చేయడం ఎంత ముఖ్యమో దాన్ని ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. ప్రతీ రోజు మంచినీటి సరఫరా చేయడానికి అవలంభించాల్సిన వ్యూహం కూడ ఖరారు చేసుకోవాలి’’ అని సీఎం సూచించారు.

‘‘మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టాలని అనుకున్న రోజు చాలా మందికి చాలా అనుమానాలుండేవి. ఈ కార్యక్రమం అవుతుందా? అనే సందేహాలుండేవి. కానీ అధికారులు, ఇంజనీర్లు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ అద్భుతమైన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. వేల కిలోమీటర్ల పైపులైన్లు వేశారు. నదీ జలాలను ప్రతీ ఊరికి తరలిస్తున్నారు. ప్రతీ ఇంటికి మంచినీళ్లు అందిస్తున్నారు. దేశంలో మరెవ్వరూ చేయని అద్భుతాన్ని తెలంగాణ రాష్ట్రం చేసి చూపెడుతున్నది. దేశానికి ఇది ఆదర్శంగా నిలిచింది. అనేక రాష్ట్రాలు మిషన్ భగీరథ లాంటి పథకాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించాయి. మన నుంచి సహకారం కూడా కోరుతున్నాయి. ఆయా రాష్ట్రాలకు అవసరమైన సహకారం అందించడానికి మనం సంసిద్ధత వ్యక్తం చేశాం. మిషన్ భగీరథ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా, దేశానికి ఆదర్శంగా నిలిచింది. దీన్ని విజయవంతం చేసిన ఘనత అధికారులు, ఇంజనీర్లదే. వారికి నా అభినందనలు. ఎంతో శ్రమకోడ్చిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు భవిష్యత్తులో ప్రాజెక్టును నిర్వహించడంపై దృష్టి పెట్టాలి’’ అని సీఎం చెప్పారు.

English

Hon’ble Chief Minister Sri K. Chandrashekar Rao has instructed the officials concerned to ensure that by March 31st, 2019 purified and quality water through Mission Bhagiratha shall reach each and every house after duly completing the tap connections. The CM desired that from 1st April 2019, not even a single person anywhere in the state is seen carrying a water pot or a vessel for fetching water from other than the house. The CM made amply clear that without hesitating to spend any amount of money water through Mission Bhagiratha should reach each and every habitation irrespective of whether it forms part of hilly areas, forest areas or remote areas.

The CM held a review meeting in Pragathi Bhavan on Monday afternoon. Advisor to the Government Sri Anurag Sharma, CMO Secretary Ms. Smita Sabarwal, Mission Bhagirath Engineer-in-Chief Sri Krupakar Reddy, MLAs Sri Vemula Prashanth Reddy, Sri Jogu Ramanna, Sri Gongidi Sunitha, Sri Rajender Reddy, Sri K. Vidya Sagar Rao, Sri Bhasker Rao, CEs, SEs and EEs from different districts attended the review meeting.

The CM elicited the views of the participant on the progress of works being carried segment wise, and in response, the officials explained in detail the progress. They informed the CM that, out of a total of 23,968 habitations the bulk supply reached through Mission Bhagiratha to 23,947 habitations. It’s only just 21 villages that are yet to get bulk supply informed the officials. They told CM that these are either in hilly areas or forests or remote areas. They also informed that tap connections have been provided to 95%of households and also the construction of OHSR are on fast track.

Speaking in the review meeting the CM said that, the objective of the Government is to supply purified drinking water through Mission Bhagiratha to every Dalit Basti, Adivasi Gudems, hamlet areas, remote areas etc. The CM made very clear that villages in Achampet, Sirpur Constituencies, Adilabad, Nirmal, Asifabad, Kothagudem districts, each and every remote area habitation, habitations in hillock areas, water shall reach through Mission Bhagiratha notwithstanding the financial burden that is to be incurred.

The CM fixed the deadline to supply water to all habitations as January 10, 2019. The CM also has instructed by March 31st, 2019 each and every bit of work pertaining to Mission Bhagiratha shall be completed and there shall not be even a single household left out without supplying the water.

“The responsibility of the Government does not cease with merely reaching the bulk water to the villages and supply at the doorstep to every house. Even after that without any interruption and hurdle that water shall be supplied continuously until the Mission Bhagiratha water supply commenced the people have adjusted themselves of obtaining water from whatever sources available to them. They consumed water that was available to them. Once they are used to Mission Bhagiratha pure drinking water it would be difficult for them to adopt to any other water. People would be put to hardship even on a single day they are denied the water supply. Hence supplying water continuously without any interruption is as important as completing Mission Bhagiratha Project. The strategy has to be drawn to see that everyday water is supplied through Misson Bhagiratha uninterruptedly” said the CM.

“When we conceptualised and taken up implementing the Mission Bhagiratha Scheme several expressed their doubts on it. Their doubts whether this programme would begin and completed. However, officials, engineers with a lot of hard work and exhibiting marvelous engineering excellence have been successfully completing the project. Thousands of kilometers of pipelines have been laid. River waters are being supplied to each and every village. Every house is getting drinking water. The State of Telangana has done this great wonder which none other states could do and became a role model to others. Many states are adopting and replicating this scheme. They are seeking cooperation from Telangana Government. We have also conveyed our preparedness and consent to extend necessary cooperation to such of those states who would like to replicate Mission Bhagiratha. Mission Bhagiratha have become not only a pride to Telangana but also as a role model to the whole of the country. I congratulate all the officers concerned and the engineers for making it a huge success. I convey my thanks to each and every one who worked hard to complete the project. In addition, to complete the project I request the officers and engineers concerned to concentrate on effective management of the project in future” said CM.

About The Author