గజగజలాడిస్తున్న పెథాయ్‌ తుపానును…

పెథాయ్ తుపాన్ హెచ్చ‌రిక
*తీరం వైపు దూసుకొస్తున్న తుపాన్‌*
*ఈ రోజు మ‌ధ్యాహ్నం 12.00 నుంచి సాయంత్రం 4.30 గంట‌ల‌లోపు తీరం దాటుతుంది*
* మ‌రోగంట‌లోపు తూర్పు గోదావ‌రి జిల్లాల్లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు, ఈదురుగాలులు*
*రాజోలు, స‌ఖినేటిప‌ల్లి, అమ‌లాపురం, మ‌లికిపురం, అంబాజీపేట‌, మామిడికుదురు, అల్ల‌వ‌రం, ఖాట్రేనికోన, ఉప్ప‌ల‌గుప్తం మండ‌లాల్లో మ‌రో గంట‌లో కుండ‌పోత వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయి.*
*ఈ ప్రాంత ప్ర‌జ‌లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌గా ఉండాలి*
*యానాం-తుని మ‌ధ్య తీరం దాట‌నున్న తుపాన్‌
*కాకినాడ‌కు వంద కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృత‌మైన తుపాన్‌*
*-రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌), ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం*

కోస్తా తీరప్రాంతాన్ని గజగజలాడిస్తున్న పెథాయ్‌ తుపానును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ), రియల్‌ టైం గవర్నెన్స్‌ (ఆర్‌టీజీఎస్‌) నుంచి వచ్చే సూచనలతో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

పెథాయ్ తుఫాన్ పై అర్ధరాత్రి, మరియు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి సమీక్షలు జరిపారు. తుపానును అత్యవసర పరిస్థితిగా భావించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార యంత్రాగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాజస్థాన్‌లో అశోక్‌ గహ్లోత్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచే తుపాను పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. జయపుర నుంచి ఆర్టీజీఎస్‌ సీఈవోకు ఫోన్‌ చేశారు.

పెథాయ్ ప్రభావంతో కాకినాడలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి 10 వేల విద్యుత్ స్తంభాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో 2 వేల మంది విద్యుత్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఉత్తరాంధ్రకు క్రేన్లు, జేసీబీలు, పోల్ డిగ్గింగ్ యంత్రాలను చేరవేయడంతో పాటు తీర ప్రాంతంలోని 6 జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని పంపించింది. ప్రతి మండలానికి ఒక ఎస్ఈ, కొన్ని మండలాలకు కలిపి ఒక డైరెక్టర్‌ను ఇన్‌ఛార్జిగా ప్రభుత్వం నియమించింది. విశాఖ, కాకినాడ, ఏలూరు, మంగళగిరి, వెంకటగిరిలో 20 బృందాలు సిద్ధంగా ఉన్నాయి.

కంట్రోల్ రూముల్లో అధికారులు 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారు. తీరప్రాంత గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాల కవాతు నిర్వహిస్తున్నారు. అన్ని సెల్ టవర్ల వద్ద డీజిల్ జనరేటర్లు సిద్ధం చేశారు.

పెథాయ్ తుఫాను వల్ల విద్యుత్ స్థంబాలు నేలకొరిగి విద్యుత్ కు అంతరాయం కలిగితే తక్షణ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం 10 వేల స్తంభాలను సిద్ధంగా ఉంచింది. రాయలసీమతో పాటు నెల్లూరు నుంచి సహాయ బృందాలను తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలకు పంపించారు. మొత్తం 2 వేల మంది సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ప్రతి సబ్‌స్టేషన్‌ పరిధిలో 500 మంది సిబ్బంది పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నారు. విద్యుత్తు పునరుద్ధరణకు అవసరమైన క్రేన్లు, జేసీబీలు, పోల్‌ డిగ్గింగ్‌ యంత్రాలు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేర్చారు. ప్రతి మండలానికి ఒక ఎస్‌ఈ, కొన్ని మండలాలకు కలిపి ఒక డైరెక్టర్‌ను ఇన్‌ఛార్జిగా నియమించి బాధ్యతలు అప్పగించారు.

About The Author