ఆరు నెలల వరకూ క్రికెట్ మ్యాచ్‌లు ఉండవు: గవాస్కర్
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ మ్యాచ్‌లు అన్నీ రద్దు అయ్యాయి. క్రికెట్ మాత్రమే కాదు.. టోక్యో ఒలింపిక్స్, వింబుల్డన్, ఫెంచ్ ఓపెన్, యూరో 2020 వంటి ప్రధాన క్రీడా టోర్నమెంట్‌లు కూడా వాయిదాపడ్డాయి. ఇక భారత్‌లో మే 3వ తేదీ వరకూ కేంద్రం లాక్‌డౌన్ విధించడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ని తాత్కాలికంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ లీగ్‌ను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంలో ఇప్పటివరకూ స్పష్టత రాలేదు.
ఐపీఎల్ మాత్రమే కాదు.. అసలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం సాధ్యమయ్యే పని కాదని ఇప్పటికీ పలువురు సీనియర్లు అభిప్రాయపడ్డారు.