తెలుగు రాష్ట్రాల్లోని ఆ రెండు నగరాల్లో లాక్‌డౌన్ పొడిగింపు..!


దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ తర్వాత ఎక్కువగా సడలింపులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కేవలం 15 నగరాల్లో మాత్రమే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నగరాల నుంచే అధికమొత్తంలో కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. అయితే.. ఈ నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి రెండు నగరాలకు చోటు దక్కింది. తెలంగాణలో హైదరాబాద్‌, ఏపీలో కర్నూలు నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా రెడ్‌జోన్‌లో ఉన్న ఈ 15 నగరాల్లో మాత్రం యథావిధిగా ఎలాంటి సడలింపులు లేకుండా లాక్‌డౌన్‌ను కొనసాగించే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. హైదరాబాద్‌, కర్నూలులో మాత్రం లాక్‌డౌన్ మరో ఒకటి రెండు నెలలపాటు కొనసాగించేందుకే ప్రభుత్వాలు మొగ్గుచూపుతాయని అంటున్నారు.

About The Author