గ్యాస్ సిలిండర్ ధరలపై భారీ తగ్గింపు !


గ్యాస్ వినియోగదారులకు నిజంగా ఇది శుభవార్త. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా వంటగ్యాస్ ఉపయోగిస్తున్న వారికి ఊరట లభించింది. తాజాగా గ్ఆయస్ సిలిండర్ ధర భారీగా దిగొచ్చింది.

గ్యాస్ ధరలు ప్రతినెలా మారుతూ ఉంటాయి.అంతర్జాతీయ మార్కెట్‌లోని క్రూడ్ ధరలు సహా రూపాయి మారక విలువపై ఆధారపడి గ్యాస్ సిలిండర్ ధర మారుతూ ఉంటుంది. అందుకే గ్యాస్ కంపెనీలు ప్రతినెల ఒకటో తేదిన గ్యాస్ సిలిండర్ ధర మారుస్తుంటాయి. ఈ క్రమంలోనే ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 214 తగ్గింది. అంటే ప్రస్తుతం వంటగ్యాస్ ధర రూ. 583 నుంచి ప్రారంభమవుతుంది. ఇక మర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా రూ. 336 క్షీణించి ప్రారంభ ధర రూ. 988 కి చేరింది. తగ్గిన కొత్త రేటు మే 1 నుంచి అమల్లోకి రానుంది.

నగరాల వారీగా గ్యాస్ సిలిండర్ ధరను గమనిస్తే..ఢిల్లీలో ధర రూ. 744 నుంచి రూ. 611కు దిగొచ్చింది. కోల్‌కతాలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 839 నుంచి రూ. 774కు తగ్గింది. ముంబైలో సిలిండర్ ధర రూ. 579కి తగ్గింది. ఇక హైదరాబాద్లో సిలిండర్ ధర రూ. 862 నుంచి రూ. 796కు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు భారీగా దిగిరావడంతో గ్యాస్ సిలిండర్ ధర కూడా దిగొచ్చింది. అయితే, పెట్రోల్‌, డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదు. మార్చి 15 నుంచి స్థిరంగానే ఉంటూ వస్తున్నాయి.

About The Author