టీటీడీ లో 1400 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపు….


*ధార్మిక సంస్థలో ధర్మం ఇదేనా*….
*మీడియా సమావేశంలో సిఐటియు నేతలు*….

*ధర్మాన్ని రక్షించండి! ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని* ప్రతి నిత్యం ప్రచారం చేసే టీటీడీ అధర్మంగా ప్రవర్తించి *14 వందల మందిని ఉద్యోగాల నుంచి తొలగించడం ఏ రకంగా మానవత్వం* అనిపించుకుంటుంది… కరోనా భయంతో వణికి పోతుంటే …. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి భక్తులు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే టిటిడి లోని పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన బహుమతా? ఇది… కార్మిక, శ్రామిక, కష్టజీవుల హక్కుల దినోత్సవం ‘ మే’ డే రోజున కార్మికుల కడుపు కొట్టే చర్యకు పాల్పడడం టిటిడి యాజమాన్యానికి తగదు… టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి గారు ఘనంగా తన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ… పేద మహిళలను వీధుల పాలు చేసి వారి గోడును పట్టించుకోక పోవడం దారుణం కాక మరేమిటి… టీటీడీలో 20 ఏళ్లకు పైగా కార్మికులు పనిచేస్తున్నారు ఇప్పటివరకు అనేక ప్రభుత్వాలు, ఈవో లు మారినా కాంట్రాక్ట్ కార్మికులు మారలేదు… భాస్కర్ నాయుడు అనే కాంట్రాక్టరును మార్చాము కాబట్టి ఆయన దగ్గర పనిచేసే 1400 మంది కార్మికులు రాకూడదని యాజమాన్యం ప్రకటించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? ప్రతిపక్ష నేతగా జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మూడు నెలల్లో టైం స్కేల్ ఇస్తామని ప్రకటించి… ఏడాది కావస్తున్నా పట్టించుకోకపోగా పనుల నుంచి కార్మికులను తొలగించటాన్ని సీఐటీయూ తీవ్రంగా ఖండిస్తోంది… కరోనా లాక్ డౌన్ సమయంలో కార్మికులను తొలగించ కూడదని, విధులకు రాకపోయినా వేతనాలు చెల్లించాలని మార్చి 20 తేదీన కేంద్ర ప్రభుత్వం తరపున కార్యదర్శి హీరాలాల్ సమారియా ఇచ్చిన ఆదేశాలను, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను సైతం ఉల్లంఘించి కుట్రపూరితంగా కార్మికులను తొలగించడం ఎంతవరకు సమంజసం… తక్షణం కార్మికులను యధావిధిగా తిరుమలలో 700 మంది, తిరుపతిలో 700 మందిని కొనసాగించాలి… వారికి వేతనాలు చెల్లించాలని కోరుతున్నాము… పరిష్కారం కాని పక్షంలో రానున్న రోజుల్లో పెద్దఎత్తున ఆందోళన నిర్వహించడానికి ఏమాత్రం వెనక్కు తగ్గేది లేదని మీడియా సమావేశంలో సిఐటియు నేతలు హెచ్చరించారు….

About The Author