మందు బాబులకు శుభవార్త…గ్రీన్ జోన్ లో వైన్ షాప్స్ ఓపెన్…
హైదరాబాద్ .. మందు బాబులకు శుభవార్తే.. ఈ నెల 3వ తేది తర్వాత గ్రీన్ జోన్ లలో వైన్ షాపులు ఓపెన్ కానున్నాయి.. ఈ మేరకు కేంద్రం అధికారికంగా ప్రకటించింది..కాగా ఎపిలో ఈ నెల మూడో తేది తర్వాత, తెలంగాణాలో ఏడో తేది తర్వాత గ్రీన్ జోన్ లలో సాధారణ కార్యకలాపాలు ప్రారంభకానున్నాయి.. గ్రీన్ జోన్ లలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వైన్ అమ్మకాలు కొనసాగనున్నాయి..షాపు వద్ద అయిదుగురు మించి ఉండరాదనే నిబంధన విధించింది.. సామాజిక దూరంతో పాటు మాస్క్ లు ధరించాలి.. పబ్లిక్ గా తాగడం నేరం..వైన్ షాపు వద్ద వైన్ తాగితే నేరుగా కేసు నమోదు చేస్తారు..ఇక వివాహాలకు 50 మంది వరకు హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చారు.. ఇక తెలంగాణాలో 13జిల్లాలు గ్రీన్ జోన్ పరిధితో ఉన్నాయి . వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, నారాయణపేట, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, ములుగు, సంగారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో కరోనా సోకిన వారంతా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో అవి యాక్టివ్ కరోనా కేసులు లేని జిల్లాలుగా నిలిచాయి..ఇక ఎపిలో గ్రీన్ జోన్ లో విజయనగరం జిల్లా మాత్రమే ఉంది.