తొలిరైలు తెలంగాణా నుండే ..సంతోషంగా సొంత ఊర్లకు


తొలిరైలు తెలంగాణా నుండే ..సంతోషంగా సొంత ఊర్లకు
.మొదలైన వలసకార్మికుల తరలింపు కరోనా లాక్ డౌన్ తో కష్టాలు అనుభవించి , దుర్భర పరిస్థితిని ఎదుర్కొన్న వలస జీవులకు కేంద్రం చెప్పిన గుడ్ న్యూస్ తో రెక్కలు కట్టుకుని సొంత ఊర్లకు పయనం అయ్యారు వలస కార్మికులు . దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉపాధి లేకపోవడంతో స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి లేక, ఉన్న చోట నానా అవస్థలు పడుతున్న వలస కార్మికులకు భారీ ఊరట కల్పిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇక దీంతో వలస కార్మికుల కోసం తొలి రైలు తెలంగాణా నుండే కదిలింది . బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను నేడు ఉదయం ప్రత్యేక రైలులో స్వస్థలాలకు పంపించారు. దీంతో వారి సంతోషం మాటల్లో చెప్పలేకుండా ఉంది. 1 తమ వారి చెంతకు వెళ్తున్న ఆనందంలో వలస కార్మికులు కరోనా లాక్ డౌన్ వలస కార్మికుల జీవితాల్లో తీరని వేదనాగా మారిన సమయంలో వారికి ఊరట నిచ్చింది కేంద్ర సర్కార్ . దీంతో 40 రోజులుగా ఎక్కడికక్కడే చిక్కుకుని, అవస్థలుపడ్డ వలస కార్మికులు, కూలీలు, మత్స్యకారులు తమ తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈ నాడే ఎదురవుతుంటే అంటూ సంతోషంగా తమ వారి చెంతకు పయనం అవుతున్నారు . ఇంతకాలం తమ వారందరికీ దూరంగా క్షణమొక యుగంలా , నరకంలో బతికినట్టు బాధ పడిన వారంతా ఇప్పుడు సంతోషంతో ప్రత్యేక బస్సులు, రైళ్లు ఎక్కారు. తమ ఆనందాన్ని చప్పట్లతో తెలియజేశారు. ప్రభుత్వం తమ కోసం తీసుకున్న నిర్ణయానికి కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు చెప్పారు. 2 బీహార్ లోని రాంచీకి బయలుదేరిన రైలు దేశ వ్యాప్తంగా వలస కార్మికులు స్వస్థలాలకు బయలుదేరారు. సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ నిర్మాణ పనులు చేస్తూ ఆకలితో ఒకానొక సమయంలో తిరుగుబాటుకు సిద్ధమైన బీహార్, జర్ఖాండ్ రాష్ట్రాలకు చెందిన 12 వందల మంది వలస కూలీలు ప్రత్యేక రైల్లో రాంచీకి వెళ్లిపోయారు. నేడు తెల్లవారు ఝామున కార్మికులు అందరూ భారీ పోలీసు బందోబస్తు మధ్య మెడికల్ చెకప్ చేసిన అనంతరం రైలు ఎక్కారు . తమ వారి దగ్గరకు వెళ్తున్నామని ఊపిరి పీల్చుకున్నారు . అందరూ రైలు ఎక్కాక రైలు రాంచీ బయలుదేరింది 3 బీహార్‌కు చెందిన బీజేపీ ఎంపీ దూబే చొరవతో వలస కార్మికుల ప్రయాణం బీహార్‌కు చెందిన బీజేపీ ఎంపీ దూబే వీరిని రాంచీ చేర్చటానికి చేసిన ప్రయత్నంతో కార్మికులంతా రాంచీకి చేరుకుని, అక్కడి నుంచి తమ తమ గ్రామాలకు చేరుకోనున్నారు. అటు గుజరాత్‌కు చెందిన కూలీలు జహిరాబాద్ మీదుగా కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులు దాటి స్వస్థలాలకు చేరుకున్నారు. వారంతా 57 ఆర్టీసీ బస్సుల్లో జర్ఖాండ్‌కు బయలుదేరారు. వీరిని 57 బస్సుల్లో ఐఐటీ క్యాంపస్ నుంచి లింగంపల్లి స్టేషన్‌కు తెల్లవారుజామున తరలించిన అధికారులు మొత్తం 1200 వలస కార్మికులను 22 కోచ్‌లు కలిగిన ఈ ప్రత్యేక రైలులో తరలించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రతినిధి తెలిపారు. 4 జార్ఖండ్ లోని హాటియాకు బయలుదేరిన కార్మికులు .. సంతోషం గా వలస కార్మిక లోకం ఇక వీరికి అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నారు . ఈ ప్రత్యేక రైలులో తాగునీరు, భోజన సదుపాయాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించినట్లు తెలుస్తుంది . జార్ఖండ్‌లోని హాటియాకు శుక్రవారం రాత్రి 11 గంటలకు ఈ ప్రత్యేక రైలు చేరుకుంటుందని ఆర్ఫీఎఫ్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ తెలిపారు. ప్రత్యేక రైలులో జార్ఖండ్‌కు చేరుకునే వారికి క్వారంటైన్, టెస్టింగ్ ఏర్పాట్లను అక్కడి ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తుంది.

About The Author