వలస కార్మికులకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ


కార్మికులు తమ తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో… వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు, కూలీలు… తమ తమ రాష్ట్రాలకు బయల్దేరుతున్నారు. ఐతే… ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వలస కార్మికులు ఢిల్లీ, ముంబై నగరం సహా చాలా రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్లంతా ఇప్పడుు ఏపీకి రాబోతున్నారు. అలాగే… ఆంధ్రప్రదేశ్‌లో కూడా వేర్వేరు జిల్లాలకు చెందిన వారు వేర్వేరు జిల్లాల్లో ఉన్నారు. అంటే… విశాఖ, విజయవాడ, తిరుపతి లాంటి నగరాల్లో ఇతర జిల్లాలకు చెందిన వారున్నారు. వారు కూడా తిరిగి తమ సొంత జిల్లాకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఇలా వెళ్లేవారికి ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
అవి… కేంద్ర ఆదేశాలకు తగ్గట్టుగా ఉన్నాయి. అవేంటే పాయింట్ల రూపంలో తెలుసుకుందాం.

– ఏపీలోని ఇతర జిల్లాల్లో ఉన్న వలస కార్మికులు 1902కి ఫోన్ చేసి తమ వివరాలు చెప్పాలి.- గ్రీన్ జోన్‌లో ఉన్నవారు మాత్రమే గ్రీన్ జోన్‌కి వెళ్లేందుకు అనుమతి ఉంది.
– రిలీఫ్ క్యాంప్‌లో నుంచి స్వగ్రామాలకు వెళ్లాలి అనుకునే వాళ్ళకు రాండమ్‌గా (అందరిలో కొందరికి) పరీక్షలు ఉంటాయి.
– కొవిడ్ పరీక్షల్లో నెగటివ్ వస్తే వారిని బస్సులో 50 శాతంకు మించకుండా తరలిస్తారు. (అంటే 36 మంది ప్రయాణించే బస్సులో 18 మందే ప్రయాణిస్తారు.)
– స్వగ్రామాల్లో 14 రోజులు క్వారంటైన్ కేంద్రంలో ఉండాలి. ఆ తర్వాత మరో 14 రోజులు ఇంట్లోనే క్వారంటైన్ ఉండాలి.- పరీక్షల్లో పాజిటివ్ వస్తే… ఆ వ్యక్తితో ఉన్న గ్రూపు మొత్తాన్నీ అక్కడే ఉంచుతారు. సొంత జిల్లాకు పంపరు.
– పాజిటివ్ వచ్చిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రి తీసుకెళ్తారు.
– ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి గురించి ఆ రాష్ట్రాల అధికారులతో ఏపీ అధికారులు సమన్వయం చేసుకుంటారు.
– ప్రతి జిల్లాలో ఒక బస్టాండ్, ఒక రైల్వేస్టేషన్‌ని గుర్తిస్తారు.
– ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు ఆ జిల్లాలో గుర్తించిన రైల్వేస్టేషన్ లేదా బస్టాండ్ చేరుకుంటారు.
– అలా వచ్చిన వారికి స్క్రీనింగ్ ఉంటుంది. పూల్ పద్ధతిలో కరోనా పరీక్షలు ఉంటాయి.
– ఇతర రాష్ట్రాల్లో రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్ నుంచి వచ్చే వారిని ప్రత్యేకంగా గుర్తిస్తారు.
– ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వెంటనే 14 రోజుల క్వారంటెన్‌ కేంద్రానికి పంపి…. ఆ తర్వాత పరీక్షలు జరిపి… నెగెటివ్ వస్తే… ఇళ్లకు వెళ్లనిస్తారు

About The Author