చిన్నాన్నను ఉరి వేయడానికి తండ్రికి సహకరిస్తున్న కూతురు!


వాళ్లిద్దరూ అన్నదమ్ములు. ఎన్నో ఏళ్ల నుంచి ఇద్దరి మధ్య భూ వివాదం కొనసాగుతోంది. పొలంలో ఒంటరిగా నున్న తమ్ముడిపై అన్న కుటుంబసభ్యులు దాడి చేశారు. అతడిని తాళ్లతో బంధించి పొలంలో ఈడ్చుకెళ్లారు. చెట్టుకు కట్టేసి ఉరేసుందుకు ప్రయత్నించారు. ఈ దారుణ సంఘటన నాగర్ కర్నూలు జిల్లా తూడుకుర్తి గ్రామంలో జరిగింది. ఈ దారుణ సంఘటన చూడండి.. తమ్ముడిని అన్న తాళ్లతో కట్టేశాడు. తాళ్లతో కట్టి అమానుషంగా పొలంలో ఈడ్చుకెళ్లుతున్నాడు. చిన్నాన్నపై తిట్ల వర్షం కురిపిస్తూ తండ్రిని అనుసరిస్తుంది కూతురు. చెట్టుకు తమ్ముడిని ఉరేసేందుకు అన్న ప్రయత్నిస్తుండగా, అతడి కూతురు సహకరిస్తుంది. Also Read – ఆ రంగం వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు నాగర్ కర్నూల్ జిల్లా తూడు కుర్తి గ్రామంలో కుర్మయ్య, తిరుపతయ్య సోదరుల మధ్య అర్ధ ఎకరా భూమిపై వివాదం కొనసాగుతోంది. తమ్ముడి కుటుంబంపై అన్న కుటుంబం దాడికి ప్రయత్నించగా, తప్పించుకున్నారు. దీంతో తమ్ముడిపై అన్న కక్ష పెంచుకున్నాడు. మరుసటి రోజు పొలంలో ఒంటరిగా ఉన్న తమ్ముడిపై అన్నతో పాటు అతడి కుటుంసభ్యులు దాడి చేశారు. తాళ్లతో కట్టేశారు. Also Read – తెలంగాణలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు తమ్ముడిని అన్న పొలంలో అమానుషంగా తాళ్లతో ఈడ్చుకెళుతుండగా, అతడి కూతురు తిట్ల వర్షం కురిపిస్తూ అనుసరించింది. తనను విడిచిపెట్టమని తమ్ముడు వేడుకుంటున్నా అన్న కనికరించలేదు. చెట్టుకు తమ్ముడిని అన్న ఉరేసేందుకు ప్రయత్నిస్తుండగా, కూతురు సహకరించింది. తమ్ముడిని అన్న ఉరేసేందుకు ప్రయత్నిస్తుండగా, చుట్టూ పక్కలవారు చూస్తుండడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. తీవ్ర గాయాలైన తమ్ముడిని సర్పంచ్ ఇంటి వద్ద పాడేశాడు. సర్పంచ్ కూడా నిందితులకు మద్దతు పలకడంతో , ఓ వ్యక్తి సలహా మేరకు బాధితుడు తిరుపతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ సంఘటనను విచారించేందుకు తూడుకుర్తికి పోలీసులు వెళ్లారు. అక్కడ తమకు లభించిన వీడియోలతో కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు కుర్మయ్యతో పాటు అతడి కుటుంబీకులను అరెస్ట్ చేశారు. కొద్దిపాటి భూమి కోసం రక్త సంబంధం మరిచి సొంత తమ్ముడిని చంపేందుకు ప్రయత్నించిన అన్న అమానుష ప్రవర్తనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

About The Author