మహిళలు కాళ్లకు పట్టీలను ధరించడం వెనుక ఉన్న సైన్స్ ఏమిటో తెలుసుకోండి..!
పురాతన కాలం నుంచి మన దేశంలో ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో అనేక విశ్వాసాలు, ఆచారాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో వాటిని చాలా మంది పాటిస్తూ వస్తున్నారు. అయితే కొందరు మాత్రం అలాంటి ఆచారాలను మూఢ నమ్మకాలని కొట్టి పారేస్తుంటారు. కానీ మీకు తెలుసా..? ఆ ఆచారాల వెనుక సైన్స్ కూడా దాగి ఉందని..! అవును, నిజమే. అలాంటి ఆచారాల్లో మహిళలు కాళ్లకు పట్టీలను ధరించడం కూడా ఒకటి.
చాలా మంది బాలికలు, యువతులు, మహిళలు ఎవరైనా పట్టీలను ధరిస్తారు. అయితే వారు వాటిని అలంకరణ సామగ్రిగానే చూస్తారు. దాంతో ఆకర్షణీయంగా కనిపించవచ్చని అనుకుంటారు. కానీ వాటి వెనుక ఓ శాస్త్రీయ కోణం ఉంది. అలా పట్టీలను ధరించడం వల్ల వారికి కేవలం అలంకరణ, ఆకర్షణీయత మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా కలుగుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
1. బంగారం లేదా వెండిలతో తయారు చేసిన పట్టీలను ధరిస్తే అవి స్త్రీల మడమలను నిరంతరం తాకుతూ ఉంటాయి. ఈ క్రమంలో అలా తాకడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయట.
2. కాలి పట్టీలు నిరంతరం కదులుతూ ఉండడం వల్ల వాటి నుంచి విడుదలయ్యే శబ్దం ఇంట్లో పాజిటివ్ శక్తిని నింపుతుంది. ఇది మనస్సుకు కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
3. ఆయుర్వేదంలో పలు రకాల ఔషధాలను లోహాలతో తయారు చేస్తారు. అయితే లోహంతో తయారు చేసిన కాలి పట్టీలను ధరించడం వల్ల అవి కాలికి తాకుతూ ఆయుర్వేద ఔషధాలను వాడినట్టు అవుతుందట. దీంతో ఆరోగ్యం కూడా ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది.