11 మంది వలస కార్మికులకు కరోనా…
వలస కార్మికుల వల్లనే ప్రస్తుతం వైరస్ కేసులు ఎక్కువ#@update’s నమోదవుతున్ననేపథ్యంలో గ్రామాల వారీగా బయటనుండి వచ్చిన వారికి ..
రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని అంతా అనుకుంటున్న వేళ వలసల టెన్షన్ మొదలైంది.
లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు తిరిగి రాష్ట్రంలో అడుగుపెట్టడంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలకు కొత్త తలనొప్పిగా మారింది. ప్రత్యేక అనుమతులు తీసుకొని వేలాది మంది రైళ్లు, బస్సులు, సొంత వాహనాల్లో రాష్ట్రానికి చేరుకుంటున్నారు. ఇలా వచ్చిన వారిలో ఇప్పటిదాకా 11 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారంతా మహారాష్ట్ర నుంచి వచ్చిన వారుగా నిర్ధారించారు. ఆ సంఖ్య ఇంకా పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలోకి వస్తున్న వలసల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మరింత అప్రమత్తం అయ్యింది. తెలంగాణలోకి వస్తున్న ప్రతి ఒక్కరిపై దృష్టి పెట్టింది. బోర్డర్ లోనే ఉష్ణోగ్రత పరీక్షలు చేసి క్వారెంటైన్ స్టాంప్స్ వేసి వారు వెళ్తున్న గ్రామాల వైద్య సిబ్బందికి సమాచారం అందిస్తున్నారు. ఇలా వచ్చిన వలస కార్మికుల వల్లనే ప్రస్తుతం వైరస్ కేసులు ఎక్కువ నమోదవుతున్ననేపథ్యంలో గ్రామాల వారీగా బయటనుండి వచ్చిన వారికి పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర నుండి వచ్చిన వారికి పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. వీరిలో మంచిర్యాల, యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన 11 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వలస కార్మికుల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోకి వస్తున్న ప్రతి ఒక్కరినీ 14 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచుతామని అధికారులు స్పష్టం చేశారు.