విదేశాల నుంచి వచ్చే జిల్లా వాసుల పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
కోయంబేడు మార్కెట్ కి వెళ్లి వచ్చిన వారిని వెంటనే గుర్తించండి
: కంటైన్మెంట్ క్లస్టర్లలో 100 శాతం మాస్కుల పంపిణీ పూర్తి చేయాలి
: జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు
అనంతపురం, మే 11:
విదేశాల నుంచి వచ్చే జిల్లా వాసులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని క్వారం టైన్ కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. సోమవారం ఉదయం నోడల్ అధికారులు, జిల్లా అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన రాష్ట్రం నుంచి, జిల్లా నుంచి ఉద్యోగం, టూరిజం, ఇతర కారణాలతో విదేశాలకు వెళ్లిన వారు తిరిగి వస్తున్నారని, వారంతా బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, బయటికి తీసుకువచ్చిన వారిని ఏం చేయాలి అనేది ముందుగా నిర్ణయించుకోవాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి ఫీడ్ బ్యాక్ ని ఆధారం చేసుకుని పెయిడ్ క్వారం టైన్ కేంద్రాల్లో లేక ప్రభుత్వ క్వారం టైన్ కేంద్రాల్లో ఉంచేలా చూడాలన్నారు. ఎయిర్పోర్టులో ప్రతి ఒక్కరూ రిజిస్టర్ లో పేరు నమోదు చేసుకునేలా చూడాలని, వారికి ఒక సిమ్ కార్డ్ ఇవ్వాలని, రిజిస్ట్రేషన్ చేయించాలని, ఆరోగ్య సేతు యాప్ ని డౌన్లోడ్ చేసుకోనేలా చూడాలని, ధర్మల్ స్క్రీనింగ్ చేయాలని, వారికి ఆహారం సరఫరా, లాజిస్టిక్ తదితర అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని, విదేశాల నుంచి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
నోడల్ అధికారుల నియామకం :
విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు డీఈవో శామ్యూల్ ని జిల్లా నోడల్ అధికారిగా నియమించామని జిల్లా కలెక్టర్ తెలిపారు. డిఈ ఓ కు తోడుగా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కూడా నియమించామని, వారికి సపోర్టింగ్ స్టాఫ్ ను కూడా ఏర్పాటు చేశామన్నారు. అలాగే విదేశాల నుంచి వచ్చే వారి కోసం అనంతపురం లో ఏర్పాటు చేస్తున్న రిసెప్షన్ సెంటర్కు బిసి వెల్ఫేర్ డిడి యుగంధర్ ను, పెయిడ్ క్వారం టైన్ సెంటర్ కి మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ మహమ్మద్ రఫీని నియమించామన్నారు. అలాగే రిజిస్ట్రేషన్, సిమ్ కార్డ్, యాప్ డౌన్లోడ్ తదితర వాటిని చూసేందుకు ఏఎంఓ జయచంద్రను, ట్రాన్స్పోర్ట్ కోఆర్డినేటర్ ను కూడా ఏర్పాటు చేశామని, బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో బస్సుల అరేంజ్మెంట్ కోసం ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ని నియమించామని, ఒక మెడికల్ టీంను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అధికారులంతా సమన్వయం చేసుకొని పని చేయాలని కలెక్టర్ సూచించారు.
కోయంబేడు మార్కెట్ కి వెళ్లి వచ్చిన వారిని వెంటనే గుర్తించండి :
చెన్నైలోని కోయంబేడు మార్కెట్ లో కరోన వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న తరుణంలో జిల్లా నుంచి కోయంబేడు మార్కెట్ వెళ్లి వచ్చిన వారిని గుర్తించాలని అగ్రికల్చర్ జేడీ హబీబ్ భాష, హార్టికల్చర్ డిడి సుబ్బరాయుడు, మార్కెటింగ్ శాఖ, నోడల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా నుంచి కోయంబేడు మార్కెట్ వెళ్లిన 310 మంది ట్రేడర్స్, క్యాషియర్ లను, ట్రక్కు ఓనర్స్, డ్రైవర్స్ క్లీనర్ లను వెంటనే గుర్తించాలని, వారితో కాంటాక్ట్ అయిన వారిని కూడా త్వరితగతిన గుర్తించాలన్నారు. మొదటి కేటగిరీ కింద ట్రేడర్స్, క్యాషియర్ లను, రెండవ కేటగిరీ కింద ట్రక్కు ఓనర్స్, డ్రైవర్స్ క్లీనర్ లను సపరేట్ క్వారం టైన్ కేంద్రంలో పెట్టాలని సూచించారు. మూడవ కేటగిరీకి చెందిన వారితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించి వారిని హోమ్ ఐసోలేషన్ లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
100 శాతం మాస్కుల పంపిణీ పూర్తి చేయాలి:
జిల్లాలోని అర్బన్, రూరల్ ప్రాంతాల్లోని అన్ని కంటైన్మెంట్ క్లస్టర్లలో 100 శాతం మాస్కులు పంపిణీ పూర్తి చేయాలని డిఆర్డిఎ పిడి నరసింహారెడ్డిని, మెప్మా పిడి విజయలక్ష్మి లను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని రూరల్ ప్రాంతాల్లోని క్లస్టర్లలో మాస్కుల పంపిణీ ఆన్లైన్లో నమోదు కావడం లేదని, వెంటనే నమోదు చేయాలన్నారు. ఇప్పటివరకు అన్ని క్లస్టర్లలో ఎంతమందికి మూడు చొప్పున మాస్కులు అందించారు, ఇంకా ఎంతమంది అందించాల్సి ఉంది అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే జిల్లాలోని అన్ని ల్యాబరేటరీలలో శాంపుల్ లను ఎంత వరకు టెస్టింగ్ చేశారు, ఇంకా ఎన్ని టెస్టింగ్ చేయాల్సి ఉంది అనేది తెలుసుకుని, ఎక్కువ స్థాయిలో శాంపుల్ లను టెస్టింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని క్వారం టైన్ కేంద్రాలలో ప్రతి ఒక్కరికి మంచి ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని క్వారం టైన్ కేంద్రాలలో ప్రతి ఒక్కరికి టెస్ట్ నిర్వహించి రిపోర్టులను అందజేయాలన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో నోడల్ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, అనంతపురం వారిచే జారీ