పెంచిన విద్యుత్ చార్జీల కు వ్యతిరేకం గా సీపీఐ ఆధ్వర్యం లో నిరసన…


పెంచిన విద్యుత్ చార్జీల కు వ్యతిరేకం గా సీపీఐ ఆధ్వర్యం లో తిరుపతి ఎ పి ఎస్ పి డి సి ఎల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ..

పాత స్లాబ్ ప్రకారమే బిల్లు లు వాసులు చేయాలని డిమాండ్ చేశారు.

కొత్త టారిఫ్ ను రద్దు చేయాలని కోరారు.

గుడిసె కు 28 వేల రూపాయలు బిల్లు వేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది అన్నారు.

కరోనా లాక్ డౌన్ లో ప్రజలు వుంటే ప్రభుత్వం చాప కింద నీరులా చార్జీలను పెంచి బారం మోపింది అన్నారు.

పెంచిన చార్జీలను రద్దు చేయాలని, ప్రతి నెల రిడింగ్ తీయాలని డిమాండ్ చేశారు.

నిరసన అనంతరం సి ఎం డీ హరినాథ్ రావు కు వినతి పత్రాన్ని సమర్పించారు.

ఈ కార్యక్రమం లో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మురళి, పెంచలయ్య, నగర కార్యదర్శి విశ్వనాధ్, పార్టీ నాయకులు రాధాకృష్ణ, శివ, రాజా, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

About The Author