ఏపీ రాజధాని తరలింపుపై హైకోర్టులో మరో పిటిషన్..


ఆ రాజధాని తరలింపుపై హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేసిన అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతి రావు

గతంలో దాఖలు చేసిన పిటిషన్ ఈనెల 4వ తేదీన విచారణకు రావాల్సి ఉంది

విచారణకు రాకపోవడంతో మళ్లీ పిటిషన్ దాఖలు చేసిన తిరుపతిరావు.

రాజధాని తరలింపు కోసం ముహూర్తం పెట్టారని జరుగుతున్న ప్రచారంపై గత నెల 24వ తేదీననే పిటీషన్ వేసినట్లు హైకోర్టు ధర్మాసనం కి తెలిపిన తిరుపతి రావు తరఫు న్యాయవాది వున్నం మురళీధర్

ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

ఈ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

చట్ట సభలలో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్న ప్రభుత్వం

సచివాలయ ఉద్యోగుల సంఘం చేసిందిగా చెప్పబడుతున్న తీర్మానంపై ఆధారపడి ఆ వ్యాజ్యం దాఖలు చేశారని, అదంతా ఊహాగానమే అని తెలిపిన ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం చట్ట సభలలో బిల్లు ప్రక్రియ పూర్తి కోసం ఎదురు చూస్తుందని, ఆ తరువాతనే చట్టాలను అనుసరించి చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం తరఫు కోర్ట్ కు వివరించిన న్యాయవాది

ఈ నేపథ్యంలో రాజధాని తరలింపు జరుగుతుందని వేసిన ఈ పిటీషన్ చెల్లుబాటు కాదని పేర్కొన్న ప్రభుత్వం

About The Author