ఉద్యోగుల వేతనాల్లో కోత: ప్రభుత్వం క్లారిటీ…


న్యూదిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆర్థిక మంత్రిత్వశాఖ కొట్టిపారేసింది. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్వీట్‌ చేసింది.
‘‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించే ఏ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించలేదు. ప్రస్తుతం ఉద్యోగుల వేతనాల్లో ఎలాంటి కోతా ఉండదు. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. అందుకు ప్రాతిపదిక ఏమీ లేదు’’ అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ట్వీట్‌ చేసింది.
కేంద్ర ప్రభుత్వం మార్చిలోనూ ఇదే విధంగా స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 20శాతం కోత విధిస్తున్నారంటూ వచ్చిన వార్తలను ఖండించింది. కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్‌ అందుకునే సీనియర్‌ సిటిజన్లు, ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తులు, వితంతువులకు మూడు నెలల ముందుగానే చెల్లింపులు చేసింది. నేషనల్‌ సోషల్‌ అసిస్టెంట్‌ ప్రోగ్రామ్‌ ద్వారా వీటిని చెల్లించింది. కాగా, గత నెలలో పెంచాల్సిన డీఏ అలవెన్స్‌ను మాత్రం జూన్‌ 30, 2021 వరకూ వాయిదా వేసింది.

About The Author