రీల్‌పై విలన్‌.. రియల్ లైఫ్‌లో హీరో…


సోనూ సూద్.. ఈ పేరు ఇటు తెలుగు అటు హిందీ ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ఎక్కువగా తన విలనిజాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకులచే ప్రశంసలు పొందుతుంటాడు సోనూ. అయితే రీల్ లైఫ్‌లో విలన్ అయినప్పటికీ, రియల్ లైఫ్‌లో మాత్రం హీరో అని నిరూపించుకుంటున్నాడు. సోనూ ఇప్పటికే ముంబయిలోని తన హోటల్‌ను కరోనా వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తున్న వైద్యులకు వసతి గృహంగా కేటాయించాడు. దాంతో పాటు ముంబయిలోని అంధేరి, జోగేశ్వరి, జుహూ, బాంద్రాతో పాటు కొన్ని మురికివాడల్లో ప్రతిరోజు 45 వేల మందికి భోజనాన్ని అందించారు .

తాజాగా వలస కూలీలు పడుతున్న ఆవేదన చూసిన ఆయన మహరాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాల నుండి ప్రత్యేక అనుమతులు తీసుకొని పది బస్సులు ఏర్పాటు చేశారు.

థానే, గుల్భర్గా నుండి వలస కూలీలని తరలించేందుకు ఈ బస్సులని ఏర్పాటు చేసినట్టు సోను చెప్పారు. ఇలాంటి పరిస్థితులలో ప్రతి పౌరుడు తమ కుటుంబంతో ఉంటే ధైర్యంగా ఉంటారు. అందుకే వారిని వారి స్వస్థలాలకి పంపాను. ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందిచింది. ఈ రెండు రాష్ట్రాలే కాక మిగతా రాష్ట్రాలలోని వలస కార్మికులకి కూడా తాను సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే సోనూ సూద్ థానేలోని బస్ స్టాప్‌కి వెళ్ళి కార్మికులకి బై చెప్పడంతో వారు చాలా సంతోషించారు.

About The Author