రైతుగా మారిన తిరుపతి అర్బన్ ఎస్‌పి రమేష్ రెడ్డి
రైతుగా మారిన తిరుపతి అర్బన్ ఎస్‌పి రమేష్ రెడ్డి
పిల్లలకు రైతాంగం, రైతుల గురించి కూడా నేర్పాలి.
లాక్ డౌన్ విధులలో భాగంగా జిల్లా యస్.పి ఏ.రమేష్ రెడ్డి ఏర్పేడు ప్రాంతాలను కలయ తిరుగుతూ ఉండగా ఏర్పేడు – వేంకటగిరి రహదారి ప్రక్కన పొలములో కొంత మంది రైతులు, రైతు కూలీలు పంట పొలములో వరి నార్లు నాటుతూ ఉండగా ఇది గమనించిన జిల్లా యస్.పి వెంటనే తన వాహనము ఆపి రైతు కూలీల వద్దకు వెళ్లి వారి యొక్క యోగ క్షేమాల గురించి అడుగుతూ ముచ్చటిస్తూ అదే సమయంలో తానూ కూడా రైతు కూలీగా పోలీస్ అనే పదాన్ని కొద్ది సమయం ప్రక్కన పెట్టి మమేకమై తానూ కూడా రైతు కూలీగా మారిపోయారు. వారి వద్ద నుండి వరి నారు కట్టను తీసుకొని తానూ కూడా పొలములో నాటడం మొదలెట్టారు. ఇది గమనించిన మిగతావారు కూడా మిక్కిలి ఆనందంతో యస్.పితో కలసి నార్లు నాటారు. ఈ సందర్భంగా యస్.పి వారిని ప్రశ్నించగా నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. మా నాన్న మా తాతల కాలం నుండి కూడా ఎక్కువగా వ్యవసాయం చేసేవారు. నేను అగ్రికల్చర్ బి.యస్.సి విధ్యాబ్యాసం చేసాను. నేను కూడా రైతు బిడ్డనే, మన మందరం ఈ రోజు మంచి ఆహారం తీసుకుంటున్నామoటే అది కాయా కష్టం పడి పండిస్తున్న రైతులవల్లే. ప్రపంచమంతా మహమ్మారి కమ్మేసి వున్న