దేశంలోనే అతిపెద్ద వంతెన.. 25న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు…
దేశంలోనే అతిపెద్ద వంతెన.. 25న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు..
బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన అత్యంత పెద్దదైన రైల్ కం రోడ్డు బ్రిడ్జిని ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ వంతెన కారణంగా అరుణాచల్‌ప్రదేశ్‌తో పాటు చైనా సరిహద్దు వెంబడివున్న ప్రాంతాలకు రాకపోకలు సులభమవుతాయి.
ఈ వంతెన పొడవు 4.94 కిలోమీటర్లు. ఇది అసోంలోని డబ్రూగఢ్ను ఢెమాజీతో అనుసంధానం చేస్తుంది. ఈ వంతెనకు పైభాగంలో మూడు లైన్ల రోడ్డుమార్గం, కిందన రెండు రైల్వే ట్రాకులు ఉన్నాయి. దీనిని బ్రహ్మపుత్రానదిపై 32 మీటర్ల ఎత్తున నిర్మించారు.