“ఉపాధి హామీ” కి అదనంగా రూ.40,000 కోట్లు…


“ఉపాధి హామీ” కి అదనంగా రూ.40,000 కోట్లు
సొంత ఊళ్లకు వెళ్లిన వలస కూలీలకూ ఉపాధి..!
వారికి వర్షాకాలంలో పని కల్పించేలా చర్యలు.

? ఉపాధీ హామీ పథకాన్ని మరింత విస్తరించే విధంగా కేంద్రం ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్
తెలిపారు .

? ఆర్థిక ప్యాకేజీలో భాగంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ. 40,000 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు.

? దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారితో సహా సొంత ఊళ్లకు వెళ్లిన వలస కూలీలకూ ఉపాధి కల్పించేందుకు వీలు కలుగుతుందన్నారు.

*ప్రకటనలో కీలక అంశాలు*

? బడ్జెట్​లో ప్రతిపాదించిన రూ. 61,000 కోట్లకు అదనంగా రూ. 40,000 కోట్లు కేటాయింపు.

? అదనపు నిధులతో సుమారు 300 కోట్ల వ్యక్తిగత పనిదినాలను కల్పించేందుకు వీలు.

? లాక్​డౌన్​తో సొంత ఊళ్లకు తిరిగి వచ్చిన వలస కూలీలకు వర్షాకాలంలో పని కల్పించేలా చర్యలు.

? ఉత్పత్తి పెంచటం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం.

About The Author