రెన్యూవల్ కోసం రైతన్నల పడిగాపులు…
కిలో మీటర్ పొడవున క్యూ లో నిలిచిన్న రైతులు ..
*కంబదూరు* ..పంటపై గతంలో తీసుకున్న రుణాలకు ప్రస్తుత ఖరీప్ సీజన్ లో రెన్యూవల్ చేయించుకోవడానికి అఖరి గడువని బ్యాంకర్లు చెప్పిన్నట్లు సామాజిక మాద్యమాలలో వ్యాప్తి చెందడంతో ఎస్బిఐ బ్యాంక్ పరిధిలోని రైతులు తెల్లవారుజామున నుండి కిలో మీటర్ పొడవున బ్యాంక్ నుండి చెక్ పోస్ట్ వరకు క్యూలో నిలిచారు.గడువులోగా రెన్యూవల్ చేయించుకుంటేనే భీమా,ప్రభుత్వ రాయితీలు,పావలా వడ్డీ వర్తిస్తుంది.లేకపోతే రైతు నష్టపోయే ప్రమాదముంది.ప్రతి రోజు సుమారుగా వందమంది రైతులకు అతికష్టం మీద తీసుకున్న రుణాలపై రెన్యూవల్ చేస్తున్నారు.రైతుల రద్ధీ పెరిగే కొద్ది టొకెన్ల పద్దతిని బ్యాంకర్లు అమలు పరిచారు.ఈ టొకెన్ల కోసం ఎండనక,ఆహర పానీయాలను వదులుకుని క్యూ లో కిలో మీటర్ పొడవున నిలిచారు.ఆగష్టు,సెప్టెంబరు నెలల వరకు లాక్ డౌన్ కారణంగా రుణాలను రెన్యూవల్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తామని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పత్రికా ప్రకటనలు వెలువరిం చాయి.అయితే ఆ ప్రకటనలు ,ఆ ఉత్తర్వులు ఇక్కడి సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు