ప్రముఖ నటి వాణిశ్రీ కి పుత్ర వియోగం…


సినీ నటి వాణిశ్రీ కుమారుడు హఠాన్మరణం అలనాటి అందాల సినీ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు అభినయ్ వెంకటేశ్ (36) మృతి చెందాడు. చెన్నైలో నివాసం ఉంటోన్న ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. తన నివాసంలో నిద్రలోనే ఆయన మృతి చెందినట్లు వివరించారు. వాణిశ్రీకి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ రోజు తెల్లవారు జామున అభినయ్ మరణించినట్లు తెలుస్తోంది. ఆయనకు భార్య, ఓ కుమారుడు (4) ఉన్నాడు. ఆయన భార్య కూడా వైద్యురాలే. రామచంద్రన్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానూ పనిచేశాడు. #IAMReporter

About The Author