తాత్కాలికంగా డీడీ స్టూడియో మూసివేత…


న్యూఢిల్లీ : గుండెపోటుతో మరణించిన దూరదర్శన్ న్యూస్ వీడియో జర్నలిస్టుకు కరోనా ఉందని పరీక్షల్లో తేలడంతో కలకలం రేగింది. ఢిల్లీ నగరంలోని డీడీ న్యూస్ వీడియో జర్నలిస్ట్ అయిన యోగేష్ కుమార్ ఇంట్లో ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. అతన్ని ఆసుపత్రికి తరలించగా ఆయన అప్పటికే మరణించాడని వైద్యులు ప్రకటించారు. వీడియో జర్నలిస్టుకు మరణానంతరం కరోనా పరీక్ష చేయగా అతనికి కరోనా ఉందని తేలింది. దీంతో డీడీ న్యూస్ కెమెరా డివిజనుకు చెందిన 50 మందిని రాంమనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించి కరోనా పరీక్షలు చేశారు. డీడీ న్యూస్ స్టూడియోను తాత్కాలికంగా మూసివేసి శానిటైజ్ చేయించాలని నిర్ణయించారు. నవ్వుతూ వీడియోలు తీసే జర్నలిస్టు ఆకస్మిక మృతిపై డీడీ ఉద్యోగులు ప్రగాఢ సంతాపం తెలిపారు. డీడీ న్యూస్ విభాగంలో ఒక్కో ఉద్యోగి వారానికి రెండురోజుల చొప్పున విధులకు వచ్చేలా చర్యలు తీసుకున్నామని డీడీ న్యూస్ అధికారులు చెప్పారు. 

About The Author