శృంగార కోరిక నిగ్రహించుకోలేక.. మద్యం బాటిల్ తో..
తమిళనాడు : ఒక్కసారి శృంగార కోరిక మదిలోకి ప్రవేశించిందంటే కుదురుగా ఉండనీయదు. ఎలాగైనా ఆ క్షణిక సుఖాన్ని పొందే వరకు మరో ఆలోచనను దరిచేరనీయదు. దీనిని నిగ్రహించుకోగల సామర్థ్యం ఎంతో మందికి ఉండదు. ఈ కామ వాంఛకు ఎవరూ అతీతులు కాదు. మనుషులే కాదు జంతువులు కూడా శృంగారానికి బానిసలే.
తమిళనాడు రాష్ట్రం నాగపట్టణం జిల్లాలోని నాగోర్ కు చెందిన ఓ 29 ఏళ్ల యువకుడు తన సెక్స్ ఆలోచన నిగ్రహించుకోలేక మే 26వ తేదీన తన మలద్వారం నుంచి ఓ మద్యం బాటిల్ ను లోపలికి చొప్పించుకున్నాడు. ఆ యువకునికి రెండురోజుల పాటు కడుపుతో పాటు మలద్వారంలో నొప్పి రావడంతో ఇంట్లో ఏవరికి చేపకుండా బాటిల్ ను బయటకు తీసేందుకు చాలా ప్రయత్నం చేశాడు. కాని ఫలితం రాలేదు. చేసేదేమీ లేక దవాఖానకు వేల్లాడంతో అక్కడి వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించి పేద పేగులో బాటిల్ ఉన్నట్టు గుర్తించారు.
అతనికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి.. రెండు గంటల పాటు శస్త్రచికిత్స చేసి మలద్వారం ద్వారానే బాటిల్‌ను బయటకు తీశారు. ఈ సందర్భంగా డాక్టర్ పాండియరాజ్ మాట్లాడుతూ.. ఇలాంటి కేసును ఇందకు ముందు ఎప్పుడు చూడలేదన్నారు. ఒక వేళ గ్లాస్ బాటిల్ పేగులో పగిలి ఉంటే ప్రమాదం పొంచి ఉండేదని, చికిత్స చేసి గ్లాస్ ముక్కలను తీయడం కష్టంగా ఉండేదని చెప్పారు. అదృష్టవశాత్తు ఆ బాటిల్ పగలలేదు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు.