మిడతల ముప్పును నివారించడంలో ప్రభుత్వం ముందు జాగ్రత్తలు..


*మిడతల ముప్పును నివారించడంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలంటూ ముఖ్యమంత్రి జగన్ కు మాజీ మంత్రివర్యులు నారా లోకేష్ లేఖ*_

★ మిడతల దండు ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలపై దాడి చేసింది.

★ మహారాష్ట్ర నుంచి ఆ దండు తెలుగు రాష్ట్రాలకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

★ అనంతపూర్ లోని రాయదుర్గం లో మిడతలు ప్రవేశించాయనే వార్తలు రైతులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

★ రాష్ట్రంలో కరోనా నివారణను తేలిగ్గా తీసుకోవడంతో ఇప్పటికే చాలా నష్టం వాటిల్లింది.

★ పారాసెటమాల్, బ్లీచింగ్ పౌడర్ వ్యాఖ్యలు రాష్ట్ర ఇమేజ్ ను దెబ్బతీసాయి.

★ మిడతల దండు ప్రభావం భయంకరంగా ఉంది.

★ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డ్రోన్లతో పురుగుమందు పిచికారీ సూచించటంతో పాటు
రాష్ట్రాలకి హెచ్చరికలు జారీ చేసింది.

★ కేంద్ర హెచ్చరికలు, పొరుగు రాష్ట్రాల విధానాలు పట్టించుకోకుండా ఏడాది వేడుకలు, పబ్లిసిటీ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

★ ముంచుకొచ్చే ప్రమాదం నివారణకు రాష్ట్ర ప్రభుత్వ సన్నద్ధత ఏమిటి ?

★ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలు ఎక్కడా కనిపించడం లేదు.

★ వ్యవసాయ రంగాన్ని అప్రమత్తం చేసి రైతులకు ముందస్తు సూచనలు ఇవ్వాలి.

★ పరిస్థితి ని అధ్యయనం చేయటానికి జిల్లా యంత్రాగాన్ని సిద్ధం చేయాలి.

★ మిడతల ప్రభావిత రాష్ట్రాలు, దేశాలతో సమన్వయం చేసుకోవాలి.

★ సాంకేతికతను వినియోగించుకుంటూ పరిష్కారాలు చేపట్టాలి.

About The Author