ఆంధ్రలో పట్టుకున్న తెలంగాణ మద్యం…
వారికి వినుకొండ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్..తెలియజేయునది…30 వ తేదీ రాత్రి వినుకొండ టౌన్ లో రెండు మద్యం కేస్ లు పట్టుకొనడం జరిగింది…వాటి వివరములు
1. వినుకొండ పట్టణానికి చెందిన ఆకుల రామ మోహన రావు అనే వ్యక్తి ప్రకాశం జిల్లా గొర్రెపాడు గ్రామంనుంచి 9 మద్యం సీసాలు తీసుకువచ్చి తన స్కూటీ డిక్కీ లో ఉంచుకొని అనుమానాస్పదం గా తిరుగుతుండగా తనిఖీలు జరిపి స్కూటీ తో సహా మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని అతని పై కేస్ నమోదు చేయడమైనది
2. వినుకొండ పట్టణానికి చెందిన ఓంగోలు హనుమంతరావు అనే దాన్యం వ్యాపారి చెక్ పోస్ట్ ఏరియా లోని తన ఆఫీస్ లో ఎటువంటి బిల్లులు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి చెందిన 7 మద్యం సీసాలు అనగా 4 రాయల్ ఛాలెంజ్ విస్కీ ఫుల్ సీసాలు, ఒక సిగ్నచర్ విస్కీ ఫుల్ సీసా, రెండు సిగ్నేచర్ విస్కీహాఫ్ సీసాలు అక్రమంగా కలిగిఉండగా మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని కేస్ నమోదుచేయడమైనది.