వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు…

 

ధనుర్మాసంలో మకర సంక్రమణానికి ముందుగా వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి. విష్ణువు కొలువై ఉన్న వైకుంఠ ద్వారాలు ఈరోజు తెరుస్తారని భక్తుల విశ్వాసం. ఏడాదిలో ఏ రోజూ దక్కని ఉత్తర ద్వార దర్శన భాగ్యం ఈ రోజున కలుగుతుంది కాబట్టి వైష్ణవాలయాలన్నీ కిక్కిరిసిపోతాయి. ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందని ఒక నమ్మకం. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. దక్షిణాయణంలో యోగనిద్రలోకి వెళ్లిన మహావిష్ణువు ఈ రోజునే మేల్కొంటాడట.

About The Author