నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం


ఈ ఏడాది ప్రారంభంలోనే ఒకసారి జనవరిలో చంద్రగ్రహణాన్ని వీక్షించిన దేశ ప్రజలు మళ్లీ ఇవాళ చంద్రగ్రహణాన్ని చూడబోతున్నారు.. పౌర్ణమి రోజున మరో చంద్రగ్రహణాన్ని చూడనున్నారు.

జ్యేష్ఠా నక్షత్రంలో ఏర్పడే ఈ గ్రహణం రాత్రి 11.15 గంటలకు ప్రారంభమై 2.34 గంటలకు ముగుస్తుందని చెబుతున్నారు..

ఇదే, సమయంలో వృశ్చిక, కుంభ, మిధున రాశుల వారు జాగ్రత్తలు పాటించాలని పండితులు చెబుతున్నారు… భారత కాలమానం ప్రకారం జూన్ 5వ తేదీ రాత్రి 11.15 గంటలకు మొదలయ్యే చంద్రగ్రహణం జూన్ 6వ తేదీ ఉదయం 2.34 గంటలకు ముగుస్తుందని..

ఈ చంద్రగ్రహణం పూర్తిగా 3 గంటల 18 నిమిషాల పాటు ఉండబోతుందని టైమ్ అండ్ డేట్ వెబ్‌సైట్ చెబుతోంది. ఇక, భారత్‌లో పూర్తిస్థాయి చంద్రగ్రహణం అర్థరాత్రి 12 గంటల 54 నిమిషాలకు కనిపిస్తుందని, వాతావరణం స్పష్టంగా ఉంటే దేశంలో అందరూ దానిని చూసేఅవకాశం ఉంది.

About The Author