మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కరోనా వైరస్…


మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కరోనా వైరస్ సోకినట్టు తెలిసింది. ఈ మేరకు పాకిస్తాన్ వార్తా చానళ్లు కథనాలను ప్రసారం చేస్తున్నాయి. దావూద్ ఇబ్రహీంతోపాటు అతడి భార్యకు కూడా కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఆ వార్తల సారాంశం. దీంతో దావూద్ పర్సనల్ బాడీ గార్డులు, ఇతర వ్యక్తిగత సిబ్బంది అందరినీ క్వారంటైన్‌కు పంపారు. భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడైన దావూద్ ఇబ్రహీం ముంబైలో పుట్టాడు. 1993 ముంబై వరుస పేలుళ్ల తర్వాత దేశం విడిచి పారిపోయాడు. అప్పటి నుంచి కరాచీలో తలదాచుకుంటున్నట్టు సాక్ష్యాలూ ఉన్నాయి. కరాచీలోని మిలటరీ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీంకు కరోనా వైరస్ చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది. దావూద్ భార్య మెహజబీన్‌కు కూడా కరోనా రావడంతో ఆమెను కూడా ప్రత్యేక వార్డులో ఉంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు.

2003 సంవత్సరంలో దావూద్ ఇబ్రహీంను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాయి భారత్, అమెరికా. 1993 ముంబై వరుస పేలుళ్ల దాడికి సంబంధించి దావూద్ ఇబ్రహీం తల మీద 25 మిలియన్ అమెరికన్ డాలర్ల నజరానా ఉంది. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ దావూద్ ఇబ్రహీంను ప్రపంచంలోని టాప్ 10 మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఒకడిగా చేర్చింది.

About The Author