వనపర్తి అసెంబ్లీనియోజకవర్గం పరిధిలో కొత్తగా 12 పోలింగ్ కేంద్రాలు…
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వనపర్తి అసెంబ్లీనియోజకవర్గం పరిధిలో కొత్తగా 12 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డి.వేణుగోపాల్ గారు తెలిపారు.కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, కొన్ని పోలింగ్ కేంద్రాల పేరు మార్పు విషయమై మంగళవారం ఆయన అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు.రానున్న పార్లమెంటరీ ఎన్నికల నేపథ్యంలో పట్టణ ప్రాంతాలలో 1100 మంది ఓటర్లు, గ్రామీణ ప్రాంతాలలో 13 వందల మంది ఓటర్లతో ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినందున కొత్తపోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు