నగరంలో ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజల్లో అవగాహన పెరగాలి

తిరుపతి:నగరంలో ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజల్లో అవగాహన పెరగాలి. అప్పుడే ప్రమాదాలు తగ్గుతాయి.యువత బైక్ రేసింగ్, నెంబర్ ప్లేట్స్ లేకపోవడం, సైలెన్సెర్లు తీసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు

తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్..

ఈ రోజు 09.06.2020 మంగళవారం సాయంత్రం నుండి తిరుపతి నగరంలోని అన్నారావు సర్కిల్, వివేకానంద సర్కిల్, రుయా హాస్పిటల్, గరుడా సర్కిల్, చెర్లోపల్లి, చంద్రగిరి నూర్ జంక్షన్ తదితర ప్రాంతాలలో అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్ గారు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ట్రాఫిక్ సిగ్నల్ ప్రాంతాలలో ట్రాఫిక్ నిర్వహణా విధానాన్ని పరిశీలించారు. ముఖ్యంగా పార్కింగ్ విధానం పట్ల ప్రజలకు అవగాహన అవసరమని సూచించారు. ఫుట్ పాత్ లపై చిరు వ్యాపారస్తులు  సైతం నిబంధనలను పాటించాలి. అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని సూచించారు. రోడ్డు పైకి వచ్చే ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని తెలిపారు. అన్నారావు సర్కిల్ నందు ప్రజలు కొన్ని సమస్యలపై నేరుగా పిర్యాదు చేసారు.

About The Author