దొంగతనం కేసును 24 గంటల్లో చేధించిన పోలీసులు

కృష్ణాజిల్లా :మచిలీపట్నం20 కాసుల బంగారం ఏడు వేల రూపాయలు  చోరీ సొత్తు స్వాధీనం.ఈ కేసును ఎంతో చాకచక్యంగా సాధించిన సిబ్బందికి రివార్డులు ప్రకటించిన జిల్లా ఎస్పీ8వ తేదీ రాత్రి  మచిలీపట్నంలోని నూరుద్దీన్ పేటలో ఒంటరిగా ఉన్న వృద్ధులు ఇంట్లో చొరబడి బీరువా తాళాలు పగలగొట్టి బంగారం నగదు అపహరణ.

ఈ నేపథ్యంలో బందరు డిఎస్పి శ్రీ మహబూబ్ బాషా గారు, సిసిఎస్ డిఎస్పి మురళీ కృష్ణ గారు మరియు ఇతర పోలీసు అధికారులతో కలసి ఈ రోజు సాయంత్రం ఇనగుదురు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిఎస్పీ గారు మాట్లాడుతూ…..l

8వ తేదీ రాత్రి మచిలీపట్నంలోని, ఇనగుదురు పోలీస్ స్టేషన్ పరిధిలోని నూరుద్దీన్ పేటలోని గోగినేని ధనలక్ష్మి అనే వృద్ధురాలి ఇంట్లో దొంగతనం జరిగింది.

ఫిర్యాదు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఇనగుదురు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం.ఈ దొంగతనం లో సుమారు 20 కాసుల బంగారము, ఏడు వేల రూపాయల నగదు అపహరణకు గురైనట్లు గుర్తించాం.కేసు నమోదు అయిన వెంటనే కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు.సిసిఎస్ DSP మురళీ క్రిష్ణ చిలకలపూడి సిఐ వెంకటన నారాయణ వారి ఆధ్వర్యంలో  ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసాం.ఏర్పాటు చేసిన ఈ బృందాలు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసును 24 గంటల్లో చేధించారు.చోరీకి గురైన 20 కాసుల బంగారాన్ని ఏడు వేల రూపాయల నగదును సుమారు 3 లక్షల 25 వేల రూపాయల విలువగల చోరీ సొత్తును రికవరీ చేశారు.ఈ కేసులో ముద్దాయి అయిన రిజ్వాన్ అదే పేటకు చెందిన పాత నేరస్తుడు చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడే వాడు.ముద్దాయి రిజ్వాన్ ను ఎంతో చాకచక్యంగా త్వరితగతిన చేధించినందుకు జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపిఎస్  సిబ్బందికి రివార్డులు ప్రకటించారు.

About The Author