మాట వినకపోతే మళ్లీ మొదటి నుంచి లాక్ డౌన్… ఆ సీఎం హెచ్చరిక

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా తిరుగుతుండడంతో భారీ ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు రూల్స్ పాటించకపోతే మళ్లీ మొదటి నుంచి రావాల్సి వస్తుందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే హెచ్చరించారు. అంటే మళ్లీ పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేస్తామని పరోక్షంగా హెచ్చరించారు. ‘ప్రభుత్వం మిషన్ మళ్లీ ఆరంభించడానికి చర్యలు తీసుకుంటోంది. గతంలో చేసినట్టే మళ్లీ దశలవారీగా మినహాయింపులు ఉంటాయి. డేంజర్ ఇంకా ఉంది. కరోనా వైరస్ ఉంది కదా అని ఆర్థిక వ్యవస్థను కూడా విస్మరించలేం.’ అని అన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మహారాష్ట్ర సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ సడలింపులు సమస్యలను పెంచితే, మళ్లీ మొదటి నుంచి లాక్ డౌన్‌ను విధించాల్సి ఉంటుందని అన్నారు. ‘మహారాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నారు. ప్రభుత్వం మీద వారికి పూర్తి నమ్మకం ఉంది. ఈ సమయంలో ప్రజలు గుమిగూడ వద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా.’ అని సీఎం ఉద్ధవ్ థాక్రే అన్నారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90,000 దాటింది. అంటే ఓ రకంగా చైనాను కూడా మించిపోయింది. మహారాష్ట్రలో కరోనా కారణంగా 3200 మంది చనిపోయారు.

About The Author