ఐశ్వర్యరాయ్ పోలికలతో టిక్ టాక్ స్టార్

ఐశ్వర్యరాయ్.. ఈ పేరు తెలియని వారుండరు అంటే అతిశయోక్తి ఉండదేమో. అందంలోనే కాకుండా అమితాబ్ కోడలిగానూ ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. పెళ్లి తర్వాత సినిమాలను తగ్గించిన ఐశ్వర్యరాయ్ మళ్లీ సినిమాలలో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’లో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇంతటి అందాల భామను పోలిన మరో భామ ఉందంటే నమ్మశక్యమా? నమ్మాలి. ఎందుకంటే ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7గురు ఉంటారు అని మన పెద్దవాళ్లు చెబుతుంటారు. అలాగే ఇప్పుడు సేమ్ టు సేమ్ ఐశ్వర్యరాయ్ పోలికలతో ఓ భామ హల్‌చల్ చేస్తోంది. విశేషం ఏమిటంటే ఆమె కూడా స్టార్ కావడం. ఆమె ఏం స్టార్ అనుకుంటున్నారా?

టిక్ టాక్ స్టార్.

ఐశ్వర్యరాయ్ పోలికలతో ఉన్న టిక్ టాక్ స్టార్ యువతి పేరు అమృత. ఈమె ఫేమస్ అయింది కూడా ఐశ్వర్యరాయ్ నటించిన దక్షిణాది చిత్రాలలోని పాటలు, సీన్స్‌ని అనుకరిస్తూనే ఫేమస్ అయింది. మరో విశేషం ఏమిటంటే ఇప్పుడీ టిక్ టాక్ స్టార్‌కు సినిమా అవకాశం కూడా వరించింది. ‘పికాసో’ టైటిల్‌తో మలయాళంలో తెరకెక్కనున్న చిత్రంలో అమృతను హీరోయిన్‌గా తీసుకున్నట్లుగా సమాచారం.

About The Author