భాగ్యనగరంలో మరోసారి లాక్‌డౌన్ ! మంత్రి కీలక వ్యాఖ్యలు


కరోనా రక్కసి తెలంగాణపై కోరలు చాస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచే అత్యధిక కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలో మళ్లీ లాక్ డౌన్ విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా చెప్పారు. భాగ్యనగరంలో కరోనా నియంత్రణకు సంబంధించి సీఎం కేసీఆర్ త్వరలోనే సమీక్ష నిర్వహించబోతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో మళ్లీ లాక్ డౌన్ విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా చెప్పారు. నగర పరిధిలో పూర్తి లాక్ డౌన్ మళ్లీ విధించాలా లేదా అన్న అంశంపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని వివరించారు. మరో రెండు లేదా మూడు రోజుల్లోపు సీఎం కేసీఆర్ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని, లాక్ డౌన్ అంశంపై ఆయనే స్వయంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. శుక్రవారం తలసాని ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది

About The Author