భార్యను అమ్మేసిన భర్త..! నోట్లకట్టల కోసం కీచక నిర్వాకం

♦ మానవత్వం సిగ్గుపడే ఈ ఘటన రాజస్థాన్​ ఉదయ్​పుర్​ ఘంటాధర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. 

♦ జావేద్ ఖాన్ అనే వ్యక్తి రోజూ తాగేవాడు. తాగిన మత్తులో భార్యను చిత్రవధ చేయడం అతనికి అలవాటు. 

నగ్నంగా ఫోటోలు తీసి చెప్పినట్టు చేయకుంటే వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బ్లాక్​మెయిల్​ చేసేవాడు. స్నేహితులతో కలిసి భార్యను శారీరకంగా కూడా హింసించేవాడు. 

♦ తాజాగా స్నేహితుల దగ్గర డబ్బు తీసుకుని ఆమెను వారికి అప్పగించేశాడు.

♦ రోజూ శారీరకంగా, మానసికంగా చిత్ర వధకు గురైన బాధితురాలు ఆ నరకం నుంచి కాపాడమని పోలీ సులను ఆశ్రయించింది. 

♦వెంటనే స్పందించిన పోలీసులు ఆమెకు వైద్యం అందించి, భర్త జావేద్​ ఖాన్​, అతడి స్నేహితుడు మోనూను అదుపులోకి తీసుకుని తమ దైన శైలిలో విచారణ చేపట్టారు.

About The Author