జర్నలిస్టుల హక్కుల కోసం ఐక్య పోరాటం…


జర్నలిస్టుల హక్కుల కోసం ఐక్య పోరాటంః
పల్లె రవికుమార్, అధ్యక్షులు, T జర్నలిస్టుల ఫోరమ్

యువ జర్నలిస్టు #మనోజ్ #కుమార్ గాంధీలో సరైన వైద్యం అందక చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు #T #జర్నలిస్టుల #ఫోరమ్ అధ్యక్షుడు #పల్లె #రవికుమార్. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్(IJU) ఆధ్వర్యంలో కోవిడ్ మహమ్మారికి బలైన సహచర జర్నలిస్టు మనోజ్ కుమార్ కి నివాళిగా #జర్నలిస్టుల #ఒకరోజు #ఉపవాస #దీక్షకు.. #పల్లె #రవికుమార్ #సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన మనోజ్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. తక్షణమే #రూ.50లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించడంతో పాటు మృతుడి భార్యకు #ఉద్యోగం, #డబుల్ #బెడ్రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మనోజ్ మరణంతోనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు తక్షణమే కోవిడ్ పరీక్షలు చేయాలని పల్లె రవికుమార్ కోరారు. విధి నిర్వహణలో భాగంగా కరోనాబారిన పడుతున్న జర్నలిస్టులకు సరైన వైద్యం అందించడంతో పాటు #రూ.50లక్షల #బీమా కల్పించాలన్నారు. అలాగే ఈ ఆపత్కాల పరిస్థితుల్లో గతంలో తాము కోరినట్లు #మూడు #నెలలపాటు #ప్రతి #జర్నలిస్టుకీ #రూ.10 #వేల #ఆర్థిక #సాయం చేసి, వారిలో భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మనోజ్ కుమార్ మరణం గాంధీ ఆస్పత్రిలోని దుస్థితికి అద్దం పట్టిందన్నారు. స్వయంగా గాంధీ వైద్యులే ఆందోళనకు దిగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. గాంధీపై లోడ్ పెరగడం వల్లే సరైన వైద్యం అందటం లేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

గతంలోనే టిమ్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం తక్షణమే కోవిడ్ వైద్యానికి అందుబాటులోకి తేవాలన్నారు #పల్లె #రవికుమార్. భేషజాలను పక్కన పెట్టి జర్నలిస్టు సంఘాలు.. జర్నలిస్టుల ఆర్థిక, ఆరోగ్య, ఉద్యోగ భద్రత కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధనలో #T #జర్నలిస్టుల #ఫోరమ్ ముందుంటుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో T జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి #మేకల #కృష్ణ, సెక్రటరీలు #కోడికంటి #శ్రీనివాస్, #పాలకూరి #రాజు తదితరులు పాల్గొన్నారు.

About The Author