బొగ్గుల కుంపటి పొగ కొంపముంచిందా …?
బొగ్గుల కుంపటి పొగ కొంపముంచిందా …?
జూబ్లిహిల్స్‌లో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద పరిస్థితుల్లో తల్లి, కొడుకు మృతి చెందారు. చలి వేస్తుందని ఇంట్లో బొగ్గుల కుంపటి ఏర్పాటు చేసుకున్న తల్లీకుమారుడు ఇళ్లంతా పొగ నిండుకుని ఊపిరాడక మృతి చెందారు.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలానికి చెందిన సత్యబాబు, అతని భార్య బుచ్చివేణి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25లోని ప్లాట్ నెంబర్ 306లో కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. పెథాయ్ తుపాను కారణంగా బాగా చలి గాలులు వీస్తుండటంతో వారు ఉండే గదిలో బుచ్చివేణి ఆమె కుమారుడు పద్మరాజు బొగ్గుల కుంపటి ఏర్పాటు పెట్టుకున్నారు. వేడిగా ఉండటానికి తలుపులు, కిటికీలు కూడా మూసేశారు. వారిద్దరూ నిద్రలోకి ఉపక్రమించిన తర్వాత ఇంట్లో పొగ కమ్ముకుని పడుకున్న చోటే మృతి చెందారు. బయటి నుంచి సత్యబాబు ఎంతసేపు తలుపుకొట్టినా తీయకపోవడంతో అనుమానంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా బుచ్చివేణి, పద్మరాజు నిర్జీవంగా పడివున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.
యజమాని ఇంట్లో కుక్క కూడా బుధవారమే చనిపోయింది.